దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన సినిమా తెరకెక్కించిన అది భారీ విజయంగా  మారుతుంది. శిల్పి జక్కన చెక్కిన శిల్పాలన్ని  అద్భుతంగా ఉన్నట్లు... దర్శకుడు జక్కన చెక్కిన సినిమాలన్ని  మహా అద్భుతం గా ఉంటాయి. అందుకే దర్శక దిగ్గజం రాజమౌళి ని అభిమానులు జక్కన్న గా  పిలుచుకుంటారు. రాజమౌళి ఎలాంటి సినిమా తీసిన బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించటం ఖాయం . ఆయన దర్శకత్వంలో ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ను  షేక్ చేసినవే. ఇక బాహుబలి అయితే ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ నే కాదు అని ఇండస్ట్రీల బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. దీంతో దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రపంచం నలుమూలలా మార్మోగిపోయింది. ఇక రాజమౌళి గురించి ఏ అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.
 ఇక బాహుబలి లాంటి సినిమా  తర్వాత జక్కన్న చేస్తున్న సినిమాపై  ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ముందే  జక్కన్న సినిమా... దానికి తోడు టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా ఈ ముగ్గురు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్  .



అయితే ఈ సినిమా గురించి చిన్న లీక్ బయటికి వచ్చిన అది సెన్సేషనల్ గా మారిపోతుంది. కాక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే  ఇప్పుడు ఈ చిత్రంపై కూడా వివాదాలు మొదలయ్యాయి. అల్లూరి యువజన సంఘం సభ్యులు ఆర్ ఆర్ ఆర్ సినిమా పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జాతీయ సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం కమర్షియల్ అంశాల కోసం... చరిత్రను వక్రీకరిస్తున్నారని... రాజమౌళి లాంటి దర్శకులకు ఇలాంటివి తగదు  అని ఆయన అన్నారు. 



 అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఎక్కడ కలిసినట్లు కానీ వాళ్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని ఆయన తెలిపారు. మరి చరిత్ర లోని విషయాలు సినిమాలో చూపించడం సరైన పద్ధతి కాదని ఆరోపిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే  పరిస్థితులు మరోలా ఉంటాయని రాజమౌళి చిత్రబృందాన్ని   హెచ్చరిస్తున్నారు. అలా  జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవో కి  వీరభద్రరావు వినతిపత్రం అందించారు. అయితే తాను తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కథ పూర్తిగా కల్పితం అని ఇదివరకే రాజమౌళి ఎన్నోసార్లు స్పష్టం చేశారు. ఒకవేళ అల్లూరి సీతారామరాజు కొమురం భీం 1920 కాలంలో కలిసి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుని ఈ కథ రాశామని దర్శకధీరుడు తెలిపారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్,  కొమరం భీమ్ గా  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.ఈ  సినిమా 2020 జూలై 30న విడుదలకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: