హీరోయిన్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ సినిమా నుండే గ్లామర్ గా కనిపించి కవ్విస్తు ఫ్యాన్స్ దగ్గర్నుంచి, దర్శక నిర్మాతలు..హీరోలను ఫ్లాట్ చేస్తుంటారు. కొందరు సాంప్రదాయబద్దంగా ఉంటు 'నేనింతే' అంటుంటారు. ఇక మరికొందరు సమయానికి తగ్గట్టుగా మారిపోతుంటారు. ప్రతీ సినిమాలోను ఒక కొత్త యాంగిల్ చూపిస్తు ఫ్యాన్స్ ని షేక్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో ప్రస్తుతం పూజా హెగ్డే టాప్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఒకటి రెండు మాత్రమే హిట్ సినిమాలున్నాయి. అయినా కూడా తనకి ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ నుండి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. చిన్న పాత్ర అయినా కూడా కోట్లలో డిమాండ్ చేస్తోంది. అయినా మన దర్శక, నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పూజా నే కావాలని ఫిక్సవుతున్నారు.

ప్రస్తుతం పూజా 'అల వైకుంఠపురములో' సినిమాలో బన్నీ సరసన, అలాగే ప్రభాస్ సినిమా తో పాటు అక్కినేని అఖిల్ సినిమాలోను హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ లో తీరిక లేకుండా ఉంది. అయినా సరే బాలీవుడ్ లో ఈ సారి ఖచ్చితంగా ఫేమస్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ సినిమా 'హౌస్‌ఫుల్ 4' దీపావళి కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి ఖర్బంద, నవాజుద్దీన్ సిద్ధిఖి వంటి స్టార్స్ నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పూజా ప్రమోషన్స్ లో 'హౌస్‌ఫుల్ 4' సినిమాను బాగా ప్రచారం చేస్తున్నారు. పూజా ముందునుంచి తన సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటు బాగా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది.

'హౌస్‌ఫుల్ 4' ప్రమోషన్లను స్టార్ట్ చేనప్పటి నుంచి పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో పూజా ఫ్యాన్స్ దీపావళి సెలబ్రేషన్స్‌ను ముందుగానే మొదలుపెట్టేశారు.. అంటు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకే కాదు రీసెంట్‌గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాకి కూడా ఇలానే  హాట్ ఫొటోషూట్‌తో సినిమాని బాగా ప్రమోట్ చేసింది. అయితే ఇలా పూజా పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ నెట్టింటి నుంచే చేయడంలో పూజా స్పెషల్ అనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: