భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. 

 

అయితే ప్రతి సంవత్సరం దీపావళి కి కొత్త సినిమాలు రిలీస్ రెడి అవుతాయి. ఈ యేడాది దీపావళికి తెలుగులో పెద్దవి కాదు కదా ఒక మోస్తరు సినిమా ఒక్కటి కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. మన హీరోలెవరూ యేడాది ఆరంభంలో దీపావళికి సినిమా అందించేలా ప్లాన్ చేసుకోలేదు.

 

కానీ ఈ ఏడాది తెలుగు సినిమా ఒకటి కూడా రిలీస్ కు సిద్ధంగా లేదు.  తమిళ హీరోలు మాత్రం దీపావళిని గట్టిగానే తీసుకున్నారు. ‘బిగిల్’ సినిమాతో విజయ్, ‘ఖైదీ’తో కార్తి ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు.ఇవి తెలుగులో కూడా 25వ తేదీనే విడుదలకానున్నాయి.

 

తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ఈ చిత్రాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు లభించాయి.మొత్తానికి ప్రతి పండుగకు కొత్త సినిమా ఏమైనా ఉందా అని వెతుక్కునే మన సినిమా ప్రియులకు ఈ దీపావళికి తమిళ సినిమాలే దిక్కయ్యాయి.

 

ఫలితంగా రెండు చిత్రాలకి ఓపెనింగ్స్ మంచి స్థాయిలోనే ఉండనున్నాయి.ప్రేక్షకులు కూడా వేరే ఆప్షన్ లేకపోవడంతో ఈ సినిమాలకే వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: