సినిమా వారికి రివ్యూ రైటర్లకి ఎప్పుడూ ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. సినిమాని దెబ్బ తీస్తుంది రివ్యూ రైటర్లే అని సినిమా వారి అభిప్రాయం. అయితే దీనికి విరుద్ధంగా మంచి సినిమాలు తీయట్లేదని రివ్యూ రైటర్ల వాదన. వీరిద్దరికీ ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి స్టార్స్ సైతం ఈ రివ్యూల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా కమెడియన్ ఆలీ రివ్యూ రైటర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.


అశ్విన్ బాబు హీరోగా నటించిన "రాజు గారి గది 3" మొన్నే విడుదలైంది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విమర్శకులు చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. అయితే సినిమా కూడా అలానే ఉందని కొందరి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాలో నటించిన ఆలీ, సినిమాకి దారుణమైన రివ్యూలు రావడంతో తన మనసులోని కోపాన్నంతా వెళ్ళగక్కాడు.


తాను థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశానని, సినిమ చూస్తున్నంత సేపు వాళ్ళు హాయిగా నవ్వుకున్నారని, తమ టీం ని అభినందించారని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ప్రివ్యూ థియేటర్లో సినిమా చూడడమే వేస్ట్ అని అన్నాడు. ప్రివ్యూ థియేటర్లో సినిమా చూస్తూ నవ్వితే తమ సొమ్మేదో పోయినట్టుగా ఎవరూ నవ్వరని..ఇకనుండి ప్రివ్యూ థియేటర్ లో సినిమాలు చూడనని తెగేసి చెప్పారు.


అయితే ఇంతటితో ఆగకుండా రాజు గారి గది 3 సినిమాకి నెగెటివ్ రివ్యూల రాసిన వారి గురించి మాట్లాడుతూ...వారంతా మూర్ఖులు...మేం సినిమా తీసేది ప్రేక్షకుల కోసమేనని, ఎవరో కోన్ కిస్కా గొట్టం గాళ్ళ కోసం సినిమా తీయమని రివ్యూ రైటర్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. సీనియర్ నటుడయిన ఆలీ ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి దీనిపై రివ్యూ రైటర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: