కామెడీ కింగ్ సొట్టబుగ్గల సుందరాంగుడు అంటే వెంటనే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి ఆలీ.. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలోకి వచ్చిన ఆలీ కమెడియన్ గా, హీరో గా ఇప్పటికి తన జోరును ఏ మాత్రం తగ్గించకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. చాలా ఆస్తిని వెనకేసుకున్నాడు కూడాను 
ఇది ఇలా ఉండగా తాజాగా ఆలీ రాజుగారి గది 3 లో నటించారు. హీరో ఫ్రెండ్ గా ఉంది దెయ్యలతో కొంచం ఎక్కువగా పోరాడి కామెడీని పండిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొన్న రిలీజ్ అయ్యింది. సినిమా బాగలేదని టాక్ తెచ్చుకుంది దానికి స్పందించిన ఆలీ సినిమా బాలేదని అనడానికి మీరు ఎవరు? మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సినిమా బాగుంది బాలేదని చెప్పడానికి మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరూ’’ అంటూ క్రిటిక్స్ పై కన్నెర్ర చేశారు అలీ..


యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో.. సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా బాగలేదని వచ్చిన కామెంట్స్ పై ఆలీ రెచ్చిపోయారు. సినిమా ఎప్పుడు చూడను అలాంటిది నేను ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసాను. సినిమాకు మేము పడ్డ కష్టం మాకు తెలుసు. సినిమాలను ఎప్పుడు కించపరచకండి  అంటూ ఆలీ వెల్లడించారు. 


ఇకపోతే ఈ సినిమా బాగలేదని అనడానికి మీరెవ్వరు అంటూ అలీ అనడమేకాదు. మీరు ఒక కొనికిస్కా గొట్టంగాళ్ళు.. అంతే అంటూ అలీ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో.. వాళ్లని నమ్ముకుని మేం ఇండస్ట్రీకి రాలేదు. సినిమాపై ఒక రాయి వేసేస్తే మేం తోపులం అని ఫీల్ అవుతారు. మీఅంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరని నేను అనుకుంటున్నా. అంటూ ఒక్కసరిగా అలీ ఫైర్ అయ్యారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: