కోలీవుడ్ లో ఇళయదలపతిగా పేరుగాంచిన విజయ్, తమిళనాట ప్రస్తుతం అతి పెద్ద సూపర్ స్టార్స్ లో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఇటీవల మంచి విజయాలతో దూసుకెళ్తున్న విజయ్, తెలుగులో మాత్రం ఇటీవల పెద్దగా హిట్స్ అందుకోలేకపోతున్నారు. గతంలో ఆయన నటించిన అదిరింది, సర్కార్, పోలీసోడు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన తుపాకీ సినిమా, తెలుగులో విజయ్ కు మంచి హిట్ ని అందించి, ఇక్కడ ఆయనకు మరింత పేరును తెచ్చిపెట్టింది. 

అందుకే అతి త్వరలో ఆయన హీరోగా తెరకెక్కుతున్న విజిల్ సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. బిగిల్ పేరుతో తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా అనువాద హక్కులను, ప్రముఖ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు, భారీ ధరకు కొనుగోలు చేయడం జరిగింది. దీపావళి కానుకగా ఈనెల 25న ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఇక తెలుగులో ఈ సినిమా ఇప్పటివరకు విజయ్ కెరీర్లో మునుపెన్నడూ రిలీజ్ కానీ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 700 థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఇది విజయ్ మూవీ కెరీర్లో పెద్ద రికార్డు అని అంటున్నారు.

అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో అట్లీ మరియు విజయ్ ల కాంబోలో వచ్చిన తేరి, మెర్సల్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో, ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టి, హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అంటున్నారు. మరి ఈ సినిమా ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: