ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో మంచి రేటింగ్స్ మరియు ఆడియన్స్ ఆదరణతో దూసుకుపోతున్న షో బిగ్ బాస్ సీజన్ 3. ఇక ఇప్పటికే ప్రసారం అయిన బిగ్ బాస్ రెండు సీజన్స్ కూడా ఎంతో అద్భుతంగా సాగడంతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం మరియు రేటింగ్స్ కూడా ఎంతో బాగా సంపాదించడం జరిగింది. మొదటి రెండు సీజన్స్ ని ఎన్టీఆర్ మరియు నాని ఇద్దరూ కూడా ఎంతో మంచి సక్సెస్ చేయగా, ప్రస్తుతం మంచి జోష్ తో సాగుతున్న మూడవ సీజన్ ని, యువసామ్రాట్ కింగ్ నాగార్జున ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు అనే చెప్పాలి. నిజానికి ఆ మధ్య కొంత ఆశాజనకంగా సాగని ఈ షో, ఇటీవల బాగా పుంజుకుని మంచి రేటింగ్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. 

ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 92 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో, దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది అనే చెప్పాలి. ఇక నిన్న వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు హౌస్ నుండి ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం షోలో బాబా భాస్కర్, రాహుల్, జ్యోతి, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి తదితరులు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో మిగిలారు. ఇక రాబోయే వారంలో ఒక్కరు కాకుండా ఏకంగా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. దానిని బట్టి ఫైనల్ గా మిగిలేది నలుగురు మాత్రమేనని, అయితే వారిలో శ్రీముఖి తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు. 

ఇక ఆ మిగిలిన నలుగురిలో ఎక్కువ శాతం గెలిచే అవకాశం కూడా ఆమెకే ఉందని, ప్రస్తుతం ఆమెకు వోటింగ్స్ విపరీతంగా వస్తున్నాయని, అవి రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని, సో దానిని బట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా శ్రీముఖి నిలిచే అవకాశమే ఎక్కువగా ఉందని వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కొంత అవాస్తవమని, కొందరు పని గట్టుకుని శ్రీముఖి గెలవాలని కోరుకుంటూ ఈ విధంగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మరికొందరు అంటున్నారు. మరి మరొక రెండు వారాల్లో పూర్తి కాబోయె ఈ షోలో నిజంగానే శ్రీముఖి విజేతగా నిలుస్తుందో, లేక మరెవరైనా నిలుస్తారో చూడాలి.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: