బాహుబలి షూటింగ్ కోసం రాజమౌళి ఐదేళ్లు తీసుకున్నాడు.  సినిమా మొదలు పెట్టిన తరువాత ఫస్ట్ పార్ట్ బాహుబలి ది బిగినింగ్ సినిమా బయటకు రావడానికి మూడేళ్ళ సమయం పడింది.  మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు.  ఈ ట్యాగ్ ఎంతగా పాపులర్ అయ్యింది అంటే.. సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది.  


సెకండ్ పార్ట్ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు అంతటి క్రేజ్ తీసుకురావడం వెనుక ఈ ట్యాగ్ ఒక కారణం అని చెప్పొచ్చు.  అంతంగా ట్రెండ్ అయ్యింది.  సినిమాపై రాజమౌళికి ఉన్న ఫ్యాషన్ ను గుర్తు చేసింది.  సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో .. సినిమా కోసం రాజమౌళి ఎంతగా కష్టపడతారో ఈ సినిమాను చూస్తే అర్ధం అవుతుంది.  మిగతా సినిమాలకు ఇది మార్గదర్శకంగా నిలిచింది.  ఇప్పుడు బాహుబలిని స్ఫూర్తిగా తీసుకొని అనేక సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా వస్తున్నాయి. 


బాహుబలి సినిమా మొదటి పార్ట్ ది బిగినింగ్ సినిమాను లండన్ లోని ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు.  మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం విశేషం.  ఇది ఈ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం.  ఈ సినిమా గురించిన అనేక విషయాలను అక్కడి ప్రేక్షకులతో పంచుకున్నారు.  మొదట విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా కథ గురించి చెప్పకుండా శివగామి గురించి ఆ తరువాత కట్టప్ప గురించి ఆ తరువాత భళ్లాల దేవా గురించి చెప్పారట.  


చివరగా బాహుబలి గురించి చెప్పగా.. దానిని ఖాయం చేసుకొని ఆ కథపై కసరత్తులు ప్రారంభించారు.  సినిమా కథ విన్న తరువాత దాదాపు ఏడేళ్లు సినిమా కథపై తర్జనభర్జనలు జరిగాయి.  ఫైనల్ గా సినిమా పూర్తయ్యే సరికి 12 ఏళ్ళు పట్టింది.  బాహుబలికి అంకురం ఏర్పడి.. సినిమా పూర్తవ్వడానికి 12 ఏళ్ల సమయం పట్టింది.  రాజులు, రాజ్యాలు, కల్పిత కథలతో సినిమాలు తీస్తే తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉన్నది.  రాజమౌళికి సినిమాలు ఎలా తీయాలో ఖచ్చితంగా తెలుసు.. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: