తీన్మార్ వార్తల ప్రోగ్రామ్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఇప్పుడు క్రమంగా హీరో అవతారం ఎత్తాడు.. ఆయన హీరోగా ప్రియ కథానాయికగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాత కావడం విశేషం. టి. ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌కుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 25న చిత్రం విడుదలవుతోంది.


ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, హరీశ్ రావు, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు. ఎన్.శంకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ...ప్రతిభ ఉంటే చిత్ర పరిశ్రమలో అందరూ పైకొస్తారు. కానీ ప్రతిభ ఉన్నా అడుక్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకూడదన్నారు. మరో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా చేసిన రసమయి... మరోసారి తెలంగాణ కళా కారులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమా చేశాడు. ఇది కూడా తెలంగాణ కళలు, సంప్రదాయాల్ని ప్రతిబింబించే సందేశాత్మక చిత్రం. ఈ సినిమాతో బిత్తిరి సత్తి తుపాకీ రాముడుగా గుర్తుండిపోతాడు. ఉద్యమకారుడిగా,ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రసమయి నిర్మాతగా డబ్బు కూడా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.


రసమయి బాలకిషన్ మాట్లాడుతూ... "ఎన్.శంకర్ అన్నలా 'శ్రీరాములయ్య లాంటి గొప్ప సినిమా తీయాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరింది. విడుదలకి దిల్ రాజు సహకారం అందించారన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ "కళలపట్ల తనకున్న మక్కువతో ఈ సినిమానిర్మించారు రసమయి బాలకిషన్. తెలుగువాళ్లంతా ఈ సినిమా చూడాలి అన్నారు.


ఈటల రాజేందర్ మాట్లాడుతూ "రసమయి బాలకిషన్ సృజనాత్మకత కలిగిన కళాకారుడు. 'తుపాకీరాముడు'ని ప్రేక్షకులు విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు సినిమా అభివృద్ధి చెందుతోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: