రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలుపెట్టిన నాటి నుండి ఎదో ఒక సమస్య ఆ మూవీని వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ కథ పై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వారాల వీరభద్రరావు ఈ మూవీ కథ పై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసారు. 

ఈ మూవీ కథ చరిత్రను తీవ్రంగా వక్రీకరిస్తోంది అంటూ ఆయన అభిప్రాయ పడ్డాడు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. 

అయితే వీరిద్దరికీ స్నేహం ఏర్పడినట్లుగా ఎక్కడా చరిత్రలో లేదనీ చరిత్రలో లేని విషయాలను ఎలా వక్రీకరిస్తూ సినిమాలు తీస్తారు అంటూ ఆయన రాజమౌళికి ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరూ ఒకేసారి స్వాతంత్ర స్ఫూర్తి పొందారు అన్న విషయం నిరాధారం అంటూ పదాల వీరభద్ర రావు తన అభిప్రాయం తెలపడమే కాకుండా చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఒక సినిమాను తీసేడప్పుడు చరిత్రగా తీస్తే ఎవరు చూడరు. ఈవిషయాలను గ్రహించి రాజమౌళి ఈ మూవీ ప్రారంభించిన సందర్భంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జక్కన్న మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ కథ పూర్తిగా కల్పితమని లీకులు ఇచ్చాడు. చరిత్రలో లేనప్పటికీ 1920 కాలంలో అల్లూరి కొమురం భీమ్ కలిసి ఉంటే ఏమి జరిగేది అన్న ఊహతో తాను ఈ మూవీని తీస్తున్న విషయం క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పడాల వీరభద్రరావు లేవనెత్తిన అంశాలతో రాజమౌళి తన కథకు సంబంధించి వివాదాలు లేకుండా జాగ్రత్త పడతాడా లేదంటే తన ఊహ ప్రకారం ఈ మూవీ కథను ఇలాగే నడిపిస్తాడా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: