ఎవరికైనా టైం ఒకటి వస్తుంది. అది ఉన్నంతవరకే వారి హవా సాగుతుంది. అది కరిగిపోగానే మళ్ళీ మామూలే. ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలమీదకు వచ్చేయాల్సిందే. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దేవీశ్రీ ప్రసాద్ స్టార్ డం అదరహో అన్నట్లుగా సాగింది. దేవీ మ్యూజిక్ కోసం టాప్ స్టార్స్ వెయిట్ చేసిన పరిస్థితి ఉండేది. అయితే అదంతా ఒకనాటి మాట అంటున్నారు. ఇపుడు స్టార్స్ మూవీస్ కి దేవీ మ్యూజిక్ తగ్గిపోయింది.


దానికి కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. దేవీ మ్యూజిక్ లో కొత్తదనం లేకపోవడం ఒక కారణమైతే ఆయన రెమ్యునరేషన్ మరో మైనస్ గా ఉంది. ఇక దేవీశ్రీ మ్యూజిక్ అంటే డైరెక్టర్లు సైతం వేలూ కాలూ పెట్టడానికి లేదు. అంతా అప్పగించేసి కూర్చోవాలన్న ప్రచారం ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే అన్నిటికంటే మరో విషయం ఏంటంటే దేవీ సక్సెస్ రేట్ కూడా ఈ మధ్య తగ్గిందట. ఇలా అన్ని వైపుల నుంచి కలసిరాకపోవడంతో దేవీశ్రీ అని ఒకనాడు కోరుకున్న వారే ఇపుడు పక్కన పెడుతున్నారు. ఇక మెగాస్టార్, కొరటాల శివ కాంబోలో 152 మూవీ వస్తోంది. దానికి కచ్చితంగా దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చేయాలి. ఎందుకంటే ఇటు మెగాస్టార్ 150 మూవీకి దేవీశ్రీ మ్యూజిక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. 151 మూవీ సైరా హిస్టారికల్ జోనర్ కావడంతో వేరే వారిని తీసుకున్నారు.


మరి సోషల్ సబ్జెక్ట్ తో వస్తున్న 152 మూవీకి దేవీశ్రీని తీసుకోవాల్సిందేనని అనుకున్నారు. మరో వైపు కొరటాల శివ డైరెక్షన్లో ఇప్పటివరకూ వచ్చిన మూవీస్ అన్నింటికీ దేవీశ్రీయే మూవీ చేశారు. అలా చూసుకున్నా దేవీయే ఖాయం. కానీ ఇపుడు సీన్ మారిందట. దేవీశ్రీ బదులుగా బాలీవుడ్లో హిట్ పెయిర్ గా ఉన్న అజయ్-అతుల్ జంటను తీసుకొచ్చి చిరు మూవీకి మ్యూజిక్ చేయిస్తారని లేటెస్ట్ టాక్. ఈ జంట భారీ మూవీస్ కి ఇపుడు బాలీవుడ్లో పెట్టింది పేరు. సైరాకు కూడా చిరు బాలీవుడ్ మ్యూజీషియన్లనే తీసుకున్నారు. మరి దీంతో దేవీశ్రీప్రసాద్ మెగా క్యాంబోకి బ్రేక్ పడినట్లయిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: