రేణు దేశాయ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి ఆమెకు ఒక్క తెలుగు పదం కూడ రాదు. అయితే ఆ తరువాత ఆమెకు పవన్ తో పరిచయం ఆపై సహజీవనం ఆ తరువాత పెళ్లి లాంటి కొన్ని ముఖ్య సంఘటనల మధ్య దాదాపు 15 సంవత్సరాలు వీరిద్దరి బంధం కొనసాగింది. 

ఈ కాలంలోనే పవన్ రేణు దేశాయ్ కి తెలుగు చదవడం వ్రాయడం నేర్పించడమే కాకుండా ఫిలిం మేకింగ్ లో అనేక విషయాలను రేణు దేశాయ్ కి నేర్పించాడని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి రేణు దేశాయ్ ఇప్పుడు రచయిత అనంత శ్రీరామ్ తో కలిసి తన ఇంగ్లీష్ కవితల పుస్తకానికి తెలుగులో అనువదించడమే కాకుండా భావయుక్తంగా ఆమె రాసిన కవితను చూసి పవన్ కూడ ఆశ్చర్య పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆమె తన కవితల పుస్తకానికి సంబంధించిన కవితలలో ఒక కవితను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిప్రాయాలు కోరింది. ప్రస్తుతం ఈ కవితకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి.  

‘నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా, విపాదరక్షగా తన ఉనికిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటోంది నన్ను నా రక్తంలో పరిమితం చేయకు, నా ప్రాణ వాహినిలా నాకు స్వేచ్ఛగా ప్రవహించాలనుంది తెరలు తెరలుగా వచ్చి బలంగా తాకే వెచ్చటి గాలుల్లో ఈకలా అలా అలా తేలిపోతుంది ఇప్పుడు నా హృదయం, మెరుపు జాడని వెతుక్కుంటూ వెళ్లే జల్లెడ లాంటి మేఘంలా ఉంది నన్ను ఆపకు - నా నెత్తుటిని ఉబకనివ్వు నేను పరవళ్లు తొక్కాలి - నేను పైపైకెగరాలి నేను కదలాలి - నేను కురవాలి విత్తనమై నేలమ్మ కడుపులో మళ్లీ మొలకెత్తాలి మళ్లీ వికసించడానికి - మళ్లీ విహరించడానికి'' అంటూ తన కలానికి పదును పెట్టి వర్షం పై భావయుక్తంగా రేణు దేశాయ్ వ్రాసిన కవితను చదివిన వారికి రేణు దేశాయ్ కి ఇంతటి పట్టు తెలుగు భాష పై ఎప్పుడు వచ్చింది అన్న సందేహం రావడం సహజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: