‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే చరణ్ జూనియర్ లు ఒకే పాటకు స్టెప్స్ వేసే సందర్భం రాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ జూనియర్ తో కలిసి సందడి చేయబోతున్నాడు. ‘దబాంగ్ 3’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఈమధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు అన్నీ వరస పరాజయాలు పొందుతున్న పరిస్థితులలో ఈ మూవీని చాలగట్టిగా ప్రమోట్ చేసి తిరిగి తన రేంజ్ ని నిలబెట్టుకోవడానికి సల్మాన్ తీవ్ర ప్రయత్నాలు చాల ముందుగానే మొదలు పెట్టేసాడు. తెలుస్తున్న సమాచారం మేరకు నవంబరు 2న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ‘దబాంగ్’ డాన్స్ టూర్ పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. 

ఈ కార్యక్రమానికి అతిధులుగా చరణ్ జూనియర్ లు కలిసి రావడమే కాకుండా వారిద్దరు సల్మాన్ ఖాన్ తో కలిసి ‘దబాంగ్ 3’ లోని ఒక పాటకు స్టెప్స్ వేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ కు చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ కార్యక్రమానికి జూనియర్ కూడ వచ్చేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాలతో పాటు అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుంటే సుదీప్ సాయి మంజేర్కర్ అర్బజ్ ఖాన్ లాంటి అనేక మంది ప్రముఖులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఎల్బీ స్టేడియం లాంటి భారీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో జనం విపరీతంగా రావడానికి సల్మాన్ వ్యూహాత్మకంగా చరణ్ జూనియర్ ల సహకారం తీసుకుంటున్నాడు అనుకోవాలి. ఏది ఏమైనా ఒకే ఫ్రేమ్ లో చరణ్ జూనియర్లతో పాటు సల్మాన్ డాన్స్ స్టెప్స్ వేస్తే అది అభిమానులకు పండుగ అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: