గతంలో హీరో కార్తి కి తెలుగులో కూడ విపరీతంగా అభిమానులు ఉండేవారు. దీనికితోడు ఇతడికి తెలుగు మాట్లాడటం బాగా వచ్చిన నేపధ్యంలో తెలుగు ప్రేక్షకులు ఇతడికి బాగా కనెక్ట్ అయ్యేవారు. అయితే వరస పరాజయాలతో ప్రస్తుతం ఇతడి పరిస్థితి పూర్తిగా అయోమయంలో ఉంది. 

ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కార్తి ఏకంగా తమిళ టాప్ హీరో విజయ్ ని టార్గెట్ చేస్తూ దీపావళి రేసుకు రావడమే కాకుండా అతడు నటించిన మూవీ తెలుగులో ‘ఖైదీ’ టైటిల్ తో డబ్ చేయబడుతోంది. చిరంజీవిని సుప్రీమ్ హీరోగా మార్చిన మూవీ ‘ఖైదీ’ ఈ టైటిల్ ను వాడుకోవడానికి చరణ్ అల్లు అర్జున్ లు కూడ భయపడిపోయారు. 

అయితే కార్తి ధైర్యంగా చిరంజీవి టైటిల్ ను వాడుకోవడమే కాకుండా చిరంజీవి సెంటిమెంట్ ను కూడ వాడుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి జీవితానికి లైఫ్ టర్నింగ్ ఇచ్చిన ‘ఖైదీ’ అప్పట్లో అక్టోబర్ 28న విడుదల అయితే ఇప్పుడు కార్తి ‘ఖైదీ’ అక్టోబర్ 25 న విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో చిరంజీవి అదృష్టంతో కూడిన సెంటిమెంట్ కార్తి కి కూడ కలిసివస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

లోకేష్ నాగరాజ్ దర్శకత్వంలో  రూపొందిన ఈ మూవీ కథ చాల పవర్ ఫుల్ అని అంటున్నారు. అంతేకాదు మరికొందరైతే విజయ్ మూవీ తమిళంలో హిట్ కొడితే తెలుగులో కార్తి ‘ఖైదీ’ సక్సస్ అంటూ కొన్ని వ్యూహాత్మక అంచనాలు వస్తున్నారు. ఇదే నిజం అయితే కార్తి కోరికమేరకు డైరెక్ట్ గా డబ్బింగ్ కాకుండా ఒక తెలుగు సినిమా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి. ప్రస్తుతం తెలుగు హీరోల సినిమాలు ఏమి దీపావళికి లేకపోవడం కూడ కార్తి కి కలిసివచ్చిన అదృష్టం అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: