టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు తేవటం మాత్రమే కాకుండా భారతదేశ సినిమా చలనచిత్ర దమ్ము అంటే ఏంటో ప్రపంచ సినిమా రంగానికి చూపించింది. బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లడం జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది బయట ప్రపంచానికి బాలీవుడ్ ఇండస్ట్రీ. అటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అన్ని సినిమాల రికార్డులను పగలగొట్టింది తెలుగు భాషకు చెందిన బాహుబలి సినిమా. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన రికార్డులు ఇప్పటికీ కూడా చెక్కుచెదరలేదు.


అంతగా బాహుబలి సినిమా పేరు సంపాదించడంతో చాలా అవార్డులు ఈ సినిమా కి రావడం జరిగాయి. ఈ నేపథ్యంలో లండన్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: 1 సినిమాను ప్రదర్శించనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అలానే మొన్న ఈ సినిమాను హిందీలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు.


ఇదిలా ఉండగా 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో ఇంగ్లీష్‌ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారట. మొత్తానికి లండన్ లో కూడా మన తెలుగు సినిమా సత్తా ఏంటో బాహుబలి టీం చూపించి లండన్ లో అదరగొట్టింది. దీంతో భారతీయ సినిమా ప్రేమికులు సోషల్ మీడియాలో బాహుబలి టీంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్.ఎస్.రాజమౌళి ఇంకా ఇటువంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: