దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి నయనతార. అయితే నయనతారచాలా కాలం తర్వాత  తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరా  విజయం తన సొంతం చేయుకుంది నయనతార. మరోవైపు 
 నయనతార తమిళంలో హీరోయిన్‌గా చేస్తూ మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ముందుకు కొనసాగుతుంది.


ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం నెట్రిక్కన్. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్న సంగతి అందరికి  తెలిసిందే. కార్తిక్ గణేశ్ సినిమా ఆటో గ్రాఫర్‌గా వ్యవహరించడం జరుగుతుంది.  ఈ సినిమాకి గిరీష్ సంగీతం అందించబోతున్నారు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రాబోతుంది ఈ సినిమా. ఇప్పటీకే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్త అవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ చిత్రీకరణ కూడా బాగా వేగంగా జరుగుతుంది.


ఈ విషయాలు అన్ని కూడా మిలింద్ రావు ప్రకటించడం జరిగింది. అతి త్వరలోనే చిత్రీకరణ  పూర్తయ్యే అవకాశముందని సమాచారం వినిపిస్తుంది. ఇందులో అంధ యువతిగా నయనతార నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్లెండ్ అనే కొరియన్ సినిమా ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలియచేయడం జరిగింది. సీరియర్ కిల్లర్ కథాంశంతో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ప్రస్తుతం  నయన్, తన ప్రియుడు విఘ్నేష్ శివన్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా  వైరల్‌గా మారిపోయింది. ఆ ఫోటోలో విఘ్నేష్‌ను చేయిని ప్రేమగా పట్టుకుని నయన్ అలా స్టైలీష్‌గా చూస్తూ.. జీన్స్ టాప్‌లో బాగా అదిరిపోయింది జంట. ఇక బోల్డ్ రోల్స్‌తో పాటు తన నటనకు అవకాశమున్న పలు పాత్రల్లో నటించి అందరిని మెప్పించింది నయనతార. గతంలో శ్రీరామ రాజ్యం సినిమాకి ‘ఉత్తమ నట’ కేటగిరీలో నంది అవార్డుకు నయనతార ఎంపిక అవ్వడం జరిగింది. ఇటు తెలుగుతో పాటు తమిళ్ సినిమాలలో కూడా మంచి గుర్తింపు లభించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: