గత శుక్రవారం  విడుదలై  నెగిటివ్ రివ్యూస్ ను రాబట్టుకున్న  కూడా  మొదటి మూడు రోజులు  బాక్సాఫీస్ వద్ద డీసెంట్  ఓపెనింగ్స్ ను రాబట్టుకుని  హిట్ దిశగా పయనిస్తోంది  రాజుగారి గది 3.  ఇక ఈ చిత్రం సోమవారం కూడా పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో  ఈ చిత్రం  సోమవారం  68లక్షల షేర్ తో  నాలుగు రోజుల్లో 4.14 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి  బ్రేక్ ఈవెన్ కు చేరువలో వుంది.  కామెడీ హర్రర్ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో  వచ్చే  కామెడీ  సీక్వెన్స్ హైలైట్స్ అయ్యాయి. 



ఇక ఈ చిత్రంతో డైరెక్టర్  ఓంకార్  హ్యాట్రిక్  విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు. అందులో  భాగంగా ఈ సిరీస్ లో వచ్చిన  మొదటి రెండు చిత్రాలు  రాజాగారి గది , రాజుగారి గది 2 డీసెంట్ హిట్లు అయ్యాయి.  ప్రస్తుతం  మరో మూడు రోజుల వరకు రాజుగారి గది 3కి   బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో  మంచి వసూళ్లనే రాబట్టుకోనుంది.   ఆశ్విన్ బాబు , అవికా గోర్  ప్రధాన పాత్రల్లో నటించిన  ఈ చిత్రాన్ని  ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్  నిర్మించగా  షబ్బీర్ సంగీతం అందించాడు. ఇదిలావుంటే  ఈసిరీస్ కు సీక్వెల్ గా  ఓ స్టార్ హీరో తో రాజుగారి గది 4 ను తెరకెక్కించే  ప్లాన్ లో వున్నాడు ఓంకార్. త్వరలోనే  ఈప్రాజెక్టు గురించి మరిన్ని  వివరాలు వెలుబడనున్నాయి. 


తెలుగు రాష్ట్రాల్లో  ఏరియాల వారిగా ఈ చిత్రం యొక్క  నాల్గో  రోజు వసూళ్ల వివరాలు 

నైజాం : 27 లక్షలు 
సీడెడ్ : 12 లక్షలు 
గుంటూరు :2 లక్షలు
కృష్ణా : 3.6 లక్షలు
పశ్చిమ గోదావరి : 3 లక్షలు 
తూర్పు గోదావరి : 4 లక్షలు 
ఉత్తరాంధ్ర : 10 లక్షలు 
నెల్లూరు : 2.7 లక్షలు 
ఏపీ &తెలంగాణ లో నాల్గో రోజు షేర్ మొత్తం = 0.64 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: