కార్తీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. ఈ సినిమా మొత్తం 'ఖైదీ' స్కిప్టు, ట్రీట్మెంట్ గా సరి కొత్తగా ఉంటుంది అని అంటున్నారు కోలీవుడ్ స్టార్ కార్తీ.  ఈ సినిమాకి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మాతలుగా వహిస్తున్నారు. ఇక సంగీతం విషయానికి  వస్తే శామ్ సీ.ఎస్ అందిచడం జరిగింది.


ఈ నెల 25న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ విలేకరులతో సమావేశం అవ్వడం జరిగింది. మొదటగా  ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ లఘు చిత్రాలు తీయడం జరిగింది. వాటి ద్వారా చిత్ర పరిశ్రమలోకి రావడానికి అవకాశం లభించింది అని కార్తీ తెలిపారు. 'ఖైదీ' కథ వినండి.. మీకు నచ్చుతుంది అని మొదటిలో నాతో చెప్పడం జరిగింది. ఈ సినిమా మొత్తం కూడా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా గా ఉంటుంది.

ఓ రోజు రాత్రి నాలుగు గంటలపాటు ఏం జరిగింది అనేదే ఈ సినిమా మొత్తం కథ. ఇందులో నా పాత్ర  నాకు చాలా బాగా నచ్చింది. పదేళ్లు జైలులో ఉండి, బయటికి వచ్చే పాత్ర అది. అతడికి ఓ కుమార్తె కూడా ఉంటుంది. పదేళ్ల తర్వాత అతడు కుమార్తెను చూశాడా? లేదా? అనేది కథ సారాంశం. ఎప్పుడూ  కూడా కుమార్తెలకు, తండ్రికి మధ్య అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది.


నిజానికి చిరంజీవి గారి టైటిల్ కోసం ఈ టైటిల్ పెట్టలేదు మేము. సినిమా కథ అలా ఉంటుంది కాబట్టి పెట్టాము అంతే. తమిళంలో కూడా ఇదే టైటిల్ తో విడుదల అవుతుంది అని కార్తీ తెలిపారు. ఈ సినిమాలో  రకరకాల పాత్రలు ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా  మంచి ప్రాధాన్యం ఉంది అని కార్తీ తెలియచేసారు. ఇక ఈ సినిమాలో నిజమైన ఖైదీలతో.. సాధారణంగా ఇలాంటి సినిమా రెండు గంటలు పాటు కథ నడుస్తుంది అని తెలియచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: