ఒకప్పుడు ప్రేమలు-పెళ్ళిళ్ళు.. విడాకులు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కామన్. బాలీవుడ్ లో ఇప్పుడు 1980వ దశకం నుంచే ఈ తరహా సంస్కృతి నడుస్తూ వస్తోంది. ఎప్పుడు ఏ జంట ఎవరితో రిలేషన్షిప్‌లో ఉంటారు... ఎప్పుడు ఎవరు ? విడిపోతారో చెప్పలేని పరిస్థితి. ఈ సంస్కృతి కొన్ని సంవత్సరాల పాటు అక్క‌డ కొన‌సాగుతోంది. సంవ‌త్స‌రాల పాటు కాపురం చేసి పిల్లలు పెళ్లి వయసుకు వచ్చాక కూడా అక్కడ స్టార్ హీరో దంప‌తులు విడిపోతున్నారు. అమీర్ ఖాన్ - మ‌లైకా అరోరా - అర్జున్ రాంపాల్ - సైఫ్ ఆలీ ఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు కొన్ని సంవత్సరాల పాటు కాపురాలు చేశాక తమ భ‌ర్త‌లు / భార్యల నుంచి విడిపోయారు.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ తరహా సంస్కృతి కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఎక్కువ అవుతోంది. తాజాగా మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చాడు. కారణాలు ఏవైనా ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో భార్యకు విడాకులు ఇవ్వటం చాలా మందిని బాధ పెట్టింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకే మరో అదిరిపోయే షాక్ తగలనుంది. ఓ పెద్ద హీరో కుమార్తె భర్తకు విడాకులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.


కొన్ని సంవ‌త్స‌రాల‌ క్రితం ఆమెను ఓ బిజినెస్ మెన్ ఇచ్చి ఆ స్టార్ హీరో వివాహం జరిపించారు. అయితే కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తడంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఆ జంట విడిపోయేందుకు సిద్ధం కాగా.. సదరు పెద్ద హీరో కూడా కుమార్తె నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. నెమ్మదిగా టాలీవుడ్ సైతం బాలీవుడ్ మాదిరి మారుతున్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: