ప్రస్తుతం  సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిలి వెండితెరపై కనిపించాలని ప్రతీ ఒక్కరూ కూడా కలలు కంటూ ఉంటారు. ఇక నటనే ప్రొఫెషన్‌గా 
చేసుకోవాలని అవకాశాల కోసం బాగా  కష్టపడుతు ఉండడం చూస్తున్నం. కొందరికి పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు ఆలా టక్కున వచ్చేస్తుంటాయి. మరికొందరికి ఎన్ని ఆడిషన్లకు వెళ్లినా చేదు అనుభవాలే మిగులుతూవుంటాయి. అలాంటి అనుభవాలను అన్ని ఎదురుకున్న హీరోల్లో ఒకడు  బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు. గురుగ్రామ్‌లో పుట్టిన రాజ్‌కుమార్ రావు చాల కలలతో ముంబయికి రావడం జరిగింది. ఆ సమయంలో రాజ్‌కుమార్ చేతిలో డబ్బు కూడా ఉండేది కాదు. 


మొదటిలో రాజ్‌కుమార్‌కి  పెద్దగా అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాడట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియచేసారు. ఎన్ని ఆడిషన్లు ఇచ్చినా కూడా ఒక్క సినిమాలోనూ కూడా సెలక్ట్ చేసుకునేవారు కాదు. కనీసం ప్రకటనలకు కూడా ఎంపిక చేసుకునేవారు కాదు అని అయినా భవనాలు తెలిపారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు  అవాంతరాలు ఎదురైనా ఆయన జీవితంపై మాత్రం ఆశలు వదులుకోలేదు. బాల్యంలో నా  స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు అని తెలిపారు. ఇంట్లో పరిస్థితి కూడా అంతగా ఉండేటి కాదు అని తెలిపారు. నా చిన్నతనంలో కొన్నిసార్లు ఉపాధ్యాయులే నా బాధ చూడలేక  నా స్కూల్ ఫీజు కట్టేవాళ్లు అని తెలిపారు. 


 ఈ రోజు కాకపోతే రేపు అవకాశం వస్తుందేమో అన్న ఒక చిన్న ఆశతో జీవిస్తూ కాలం గడిపాడు. అలా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రణ్’ అనే సినిమాతో రాజ్‌కుమార్ తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టడు. ఈ సినిమాకుగానూ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 వేలు మాత్రమే. కొన్ని సందర్భాలలో డబ్బు సరిపోక బిస్కెట్లు నీటితోనే కడుపు నింపుకునేవారు. ఒకవేళ డబ్బు ఉన్నా బయట రెస్టారెంట్లకు వెళ్లి రోటీలు తినడానికే సరిపోయేవి అని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ రావుకు ‘లవ్ సెక్స్ ఔర్ దోఖా’, ‘రాగిని ఎంఎంఎస్’ సినిమాలు బాగా విజయం సాధించాయి.


ఈ సంవత్సరంలో విడుదలైన 'జడ్జిమెంటర్ హై క్యా' సినిమా తర్వాత రాజ్ కుమార్ రావు నటించిన సినిమా 'మేడ్ ఇన్ చైనా'. ఈ సినిమాలో ఆయన ఓ వ్యాపారి పాత్రలో పోషించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది . ఈ సినిమాలో  మోనీ రాయ్, బొమాన్ ఇరానీ కీలకపాత్రలు పోషించారు. ఈ నెల  25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: