టాలీవుడ్ నిర్మాతలకు రాజకీయం కొత్త కాదు, అనేకమంది ఎంపీలుగా కూడా పోటీ చేశారు. కొందరు గెలిచారు. అందులో మొదట చెప్పుకోవాల్సింది డాక్టర్ డి  రామానాయుడుని. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక తరువాత వచ్చిన అల్లు అరవింది. అశ్వనీదత్ ఎన్నికల్లో ఎంపీలుగా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నుంచి బరిలోకి దిగి ఓటమిపాలు అయ్యారు. ఇపుడు టాలీవుడ్ నుంచి మరో బడా నిర్మాత రాజకీయాల వైపు చూస్తున్నారన్న వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.


 మొన్న మోడీ సినీ ప్రముఖులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి  టాలీవుడ్ నుంచి ఒక్క దిల్ రాజ్ కే ఇన్విటేషన్ వచ్చింది. దాని మీద మెగా కోడలు ఉపాసన ఏకంగా మోడీకి టార్గెట్ చేస్తూ లెటర్ కూడా  రాసి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరి దిల్ రాజుకు ఎలా ఆహ్వానం వచ్చింది, దీని వెనక కధేంటి అన్నది ఆరా తీస్తే ఎన్నో విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయట.దిల్ రాజుని ఈ మధ్య ఓ కేంద్ర మంత్రి కలసి బీజేపీలోకి ఆహ్వానించారని టాక్. నిజానికి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరున్న దిల్ రాజుకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చాలా కాలంగా ఉందని అంటారు. ఆయన టీయారెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తారని కూడా అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది.


ఇక తాజాగా జగన్ ఏపీ సీఎం అయ్యాక టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా దిల్ రాజు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన జగన్ ప్రమాణానికి కూడా హాజరయ్యారు. అందువల్ల వైసీపీలోకి వస్తారని టాక్ నడించింది. ఇపుడు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో కరచాలనం చేయడం, ఇది తన అద్రుష్టమంటూ ఆయన దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో రాజు గారి దారి కమలం వైపా అన్న సరి కొత్త చర్చ తెరమీదకు వస్తోందట. మొత్తానికి రాజు గారు కాషాయకండువా కప్పుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయనేమో పెదవి విప్పడంలేదు. ఏది ఏమైనా విజయవంతమైన సినిమాలు తీసిన ఈ నిర్మాత కనుక బీజేపీలోకి వస్తే ఆయన రాజకీయం బాగా ఉంటుందని కమలనాధులు హామీ ఇస్తున్నారుట. చూడాలి మరి దిల్ రాజు దిల్ ఎక్కడ ఉందో.



మరింత సమాచారం తెలుసుకోండి: