తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిన అమ్మడు ఇలియానా ఇన్నాళ్లు ఆండ్రూతో డేటింగ్ లో ఉండి సినిమాలకు దూరంగా ఉంది. అయితే అతనితో విడిపోయాక మళ్లీ తన గాలి సినిమాల వైపు మళ్లినట్టు ఉంది. అందుకే ప్రస్తుతం అమ్మడు తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం లో తన పిక్స్ తో ఆకట్టుకుంటుంది.


ఇక లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తుతం తన స్టేటస్ సింగిల్ అనే చెప్పింది ఇలియానా. ఇదిలాఉంటే కేవలం ఒకరితో మాత్రమే కాదు తాను డేటింగ్ చాలామందితో చేశానని చెప్పింది ఇలియానా. అయితే ఎంతమందితో డేటింగ్ చేసినా సరే కాని వారి నుండి బొకేలు మాత్రం ఎవరి దగ్గర తీసుకోలేదని చెబుతుంది ఇలియానా.


డేటింగ్ చేసినా సరే ఎవరు తనకు ఆ కోరిక తీర్చలేదని అంటుంది ఇలియానా. బొకేలు గిఫ్టులుగా తీసుకోవడం తనకు ఇష్టమని అందుకే కాని ఏ ఒక్కరు అలా తనకు ఇవ్వలేదని అన్నది ఇలియానా. డేటింగ్ రహస్యాలతో పాటుగా ఇక మీదట మళ్లీ తాను సినిమాల మీదనే ఎక్కువ దృష్టి పెడతానని అంటుంది ఇల్లీ బేబ్.


కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు గ్రీన్ సిగ్నల్ అంటుంది ఇలియానా. ఇలా అయినా సరే తన కెరియర్ గాడిలో పడుతుందని ఆశ పడుతుంది. ఈమధ్య మళ్లీ స్లిం గా మారి తన లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇలియానా. మరి ఈ గోవా బ్యూటీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. అయితే ఇంతకుముందు కన్నా మరింత హాట్ గా కూడా కనిపించేందుకు సై అంటుంది ఇలియానా.


మరింత సమాచారం తెలుసుకోండి: