భారతీయ చిత్రాలలో గర్వించదగ్గ చిత్రంగా నిలబడ్డ చిత్రం. బాహుబలి. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని దృశ్యకావ్యాన్ని మనకి చూపించారు రాజమౌళి. బాహుబలి తర్వాత తెలుగు సినిమా గతి పూర్తిగా మారిపోయింది. తెలుగు చలనచిత్రాన్ని శిఖరాగ్రాన నిలబెట్టిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ప్రదర్శితమైంది. చిత్ర ప్రదర్శన కోసం రాజమౌళి దేశ దేశాలు చుట్టొచ్చారు.


అయితే బాహుబలి రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైంది. ఈ హాల్ లో ప్రదర్శితమైన మొట్ట మొదటి నాన్ ఇంగ్లీష్ చిత్రంగా బాహుబలి రికార్డులకెక్కింది. సినిమా రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాలయినా బాహుబలికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.  అయితే అంతా బాగానే ఉంది కానీ ఒక విషయంలో కొంచెం తేడా జరిగిందని తెలుస్తుంది. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో విడుదలైంది.


మరి అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఏ భాషలో ప్రదర్శించి ఉంటారని సందేహం వచ్చింది. అయితే ఇక్కడ సందేహ పడాల్సింది ఏముంది. తెలుగు భాషలో నిర్మితమైన ఈ చిత్రం తెలుగు భాషలోనే ప్రదర్శితం అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఇక్కడే తెలుగు వారికి నిరాశ కలిగింది. ఎందుకంటే ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి హిందీలో ప్రదర్శించారు.


తెలుగు చిత్రమైన బాహుబలిని డబ్బింగ్ వెర్షన్ అయిన హిందీలో ప్రదర్శించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అపోహ ఉంది. ఈ సమయంలో తెలుగు సినిమా అంటే ప్రపంచానికి తెలిసేది కదా అని వాదిస్తున్నారు. అయితే బాహుబలి రిలీజ్ అయినప్పుడే తెలుగు సినిమా ఏంటనేది తెలిసిపోయింది.  అదీ గాక రాజమౌళి పంచకట్టులో మెరిసి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు..



మరింత సమాచారం తెలుసుకోండి: