'బాహుబలి: ది బిగినింగ్'..'బాహుబలి: కన్‌క్లూజన్..రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలతో తెలుగు సినిమా ఘనత ఎక్కడికో వెళ్ళిపోయింది. హాలీవుడ్ రేంజ్ ని తలదన్నేలా జక్కన్న మేకింగ్ యావత్ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఏకంగా ప్రభాస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి భాగాలను బీట్ చేసేలా వచ్చిన సాహో, సైరా...సినిమాలు బాహుబలి సినిమాకి ఏ విషయంలోను దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. దాంతో తను క్రియేట్ చేసిన హిస్టరీని తనే బ్రేక్ చేయగల సత్తా ఉన్నవాడు కేవలం రాజమౌళి మాత్రమే అని అందరు రాజమౌళి ని ప్రశంసించారు. ఇదిలా  ఉండగానే బాహుబలికి మరో అరుదైన గౌరవం దక్కింది. రీసెంట్‌గా 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాను లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ పెర్ఫామెన్స్ తో స్క్రీనింగ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ ఘనత అందుకున్న తొలి నాన్ - ఇంగ్లీష్ ఫిలిం 'బాహుబలి' మాత్రమే. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినిప్రేమికులందరు సంతోషించాల్సిన, గర్వంగా ఫీలవ్వాల్సిన సందర్భం అని చెప్పక తప్పదు. ఇక ఈ స్క్రీనింగుకు 'బాహుబలి' టీమ్ సభ్యులు హాజరయ్యారు. కానీ ఈ స్క్రీనింగ్ గురించి తెలుగు సినీ అభిమానులు కొందరు నిరాశకు గురయ్యారని సమాచారం. ఎందుకంటే రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించినది 'బాహుబలి: ది బిగినింగ్' హిందీ వెర్షన్ కావడమే. దీంతో అక్కడ స్క్రీనింగ్ తెలుగు వెర్షన్ జరుగుతుంది కదా అనుకున్నవారికి గట్టి షాక్ తగిలింది. సినిమా ఒరిజినల్ వెర్షన్ తెలుగు అయితే డబ్బింగ్ వెర్షన్ ను అక్కడ ప్రదర్శించారేంటని కొందరు తెలుగు సినీ ప్రేమికులు బాగా హర్టయ్యారు.   

ఎంతోకాలంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే ఒక భిన్న అభిప్రాయం ఉంది. దానికి బలాన్ని చేకూర్చేలా రాయల్ ఆల్బర్ట్ హాల్ లో తెలుగు వెర్షన్ కాకుండా హిందీ వెర్షన్ స్క్రీనింగ్ చేయడంతో చాలామంది తెలుగువాళ్ళు బాధను వ్యక్తపరచారు. 'బాహుబలి' కారణంగా హిందీ సినిమాకు గౌరవం దక్కిందే కానీ ఇప్పటివరకూ ఏ ఒరిజినల్ హిందీ సినిమా కూడా ఈ ఘనతను సాధించ లేకపోవడం ఆసక్తికరం. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో తెలుగు వెర్షన్ స్క్రీనింగ్ జరిగి ఉంటే ఇంకా బాగుండేది. ఒక రకంగా మన తెలుగు సినిమాని అవమానించినట్టే అని కొందరు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అయితే హిందీ వెర్షన్ స్క్రీనింగ్ జరగడం వల్ల 'బాహుబలి' గొప్పతనం కాస్త కూడా తగ్గినట్టు ఏమాత్రం కాదన్న విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: