నేషనల్ స్టార్  ప్రభాస్ మొత్తానికి 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు.   రేపు లండన్ లో  తన 40వ  పుట్టినరోజును   చేసుకోబోతున్నారు. ఇప్పటికే బాహుబలి టీమ్ తో లండన్ వెళ్లిన రెబల్ స్టార్  తన బర్త్ డే వేడుకలను కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారు. అందుకే  ప్రభాస్ సన్నిహితులు అందరూ  లండన్‌ కి వెళ్లారు.  వారితో కలిసి ప్రభాస్ పుట్టిన రోజును చాల గ్రాండ్ గా  జరుపుకోనున్నారు. అయితే ప్రభాస్ లండన్ నుండి తిరిగి వచ్చాక తన తరువాత సినిమాకి సంబంధించి చర్చలు జరిపి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  కాగా ఇప్పటికే, పరుశురామ్, సురేందర్ రెడ్డి మరియు కొంతమంది హిందీ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌భాస్‌ ఇండియా రాగానే మొదట ప‌రుశురామ్  క‌థ చెప్ప‌బోతున్నాడ‌ట‌. మ‌రి ప‌రుశురామ్ చెప్పబోయే కథ నచ్చితే..   ప్ర‌భాస్ - పరుశురామ్ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు.   ఇక అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన  'సాహో' సినిమా  నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మొత్తానికి  బాక్సాఫీస్ వద్ద విఫలం అయింది.  అందుకేనేమో  ప్రభాస్ తన కొత్త సినిమాల పై చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో  చేస్తోన్న  జాన్ సినిమా విషయంలో కొన్ని మార్పులు చేశాడు.   ముఖ్యంగా స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని దర్శకుడికి చెప్పి మరి చేయించాడు. పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. 

కాగా జాన్  పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా  సాగే ఓ థ్రిల్లింగ్  ప్రేమకథ అట.   పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుంది,   మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ  గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.  ఇక   'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  బలమైన ఓపెనింగ్స్  సాధించినా  చివరికి ప్లాప్ చిత్రంగా నిలిచింది.  'సాహో'  ప్లాప్ తో వార్తల్లో నిలిచిన దర్శకుడు సుజీత్  చిన్న వయసులోనే అంత పెద్ద భారీ బడ్జెట చిత్రాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడనే అపవాదును మూట కట్టుకున్నాడు.  అందుకే ఈ సారి దర్శకుల విషయంలో  ప్రభాస్ తొందర పడదలచుకోలేదు.       


మరింత సమాచారం తెలుసుకోండి: