బాహుబలి బిగినింగ్.. బాహుబలి కన్‌క్లూజన్.. సాహో.. అంటూ పాన్ ఇండియా సినిమాల్లో నటించాడు ప్రభాస్. దాంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి రికార్డ్ సృష్టించాడు. అయితే సాహో మాత్రం కొత్త తరహాలో రకరకాల పాఠాల్ని నేర్పింది. ఈ సినిమా నార్త్ లో ఒకలా.. సౌత్ లో ఇంకోలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ దెబ్బతోనే ప్రభాస్ కొత్తగా సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో 20వ సినిమా జాన్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ అవగానే.. కెరీర్ 21 వ సినిమాని మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి కథేంటి.. దర్శకుడు ఎవరు? అన్నది ఇప్పటివరకూ ఫైనల్ కాలేదు. 

ఆ క్రమంలోనే సీనియర్ దర్శకులతో పాటు యంగ్ డైరెక్టర్లు ప్రభాస్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే వీళ్లందరిలోనూ గీత గోవిందం ఫేం పరశురామ్ పేరు తాజాగా బయటకు వచ్చింది. పరశురామ్ స్క్రిప్టుతోనే ప్రభాస్ ని ఒప్పిస్తాడా  లేదా? అన్నది తేల్చాల్సి ఉంది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ ఒక స్టార్ ని ఒప్పించలేక బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. గీత గోవిందం హిట్ తర్వాత బన్ని కి పరశురామ్ ఓ కథ చెప్పాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. తర్వాత మహేష్ ని కలిసిన కుదరలేదు. ఆ తర్వాత సీనియర్లను కాదనుకుని యువహీరోలతోనూ చేయాలనుకొని అఖిల్ కోసం ట్రై చేశాడు. కానీ అదీ ఫైనల్ అవలేదు. ఆ క్రమంలోనే పరశురామ్ కి యూవి క్రియేషన్స్ కబురొచ్చిందట. 

ప్రభాస్ యువదర్శకులకు ప్రియారిటీనిస్తున్నారన్న మాట పరశురామ్ కి ఉత్సాహాన్నిచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ కి స్క్రిప్టు వినిపించడం అంటే పాన్ ఇండియా లెవల్ లోనే వినిపించాలి. యూనివర్సల్ ఆడియెన్ ని మెప్పించేదిగా  స్క్రిప్ట్ ఉండాలి. అంటే ఆ రేంజ్ లో పరశురామ్ మంచి కథతో రెడి అవ్వాలి. కేవలం తెలుగు ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినా .. ప్రభాస్ కి డబ్బింగ్ రైట్స్ పరమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగానూ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి కంటే ముందు ప్రభాస్ ని స్క్రిప్టుతో ఒప్పించడం అంటే అంత ఈజీ కాదు. మరి బన్ని, మహేష్ లను ఒప్పించలేని పరశురామ్ ప్రభాస్ ని ఎలా ఒప్పించగలడు అన్న మాటలు బాగానే వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: