బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ కెరీర్ దూసుకెళుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్స్‌ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకునే నటుల్లో రాజ్‌కుమార్ ఒకరు. 2010లో లవ్ సెక్స్‌ దోఖా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాజ్‌కుమార్‌ విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.  కంగనా రనౌత్‌, ప్రియాంక చోప్రా వంటి టాప్‌ హీరోయిన్లకు జోడీగా నటించి కీలక నటుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో పింక్‌విల్లా వెబ్‌సైట్‌తో మాట్లాడిన రాజ్‌కుమార్‌ చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం గురించి చెప్పుకొచ్చాడు.

‘ తాను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడినని,  కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని అన్నాడు.  స్కూలు ఫీజు కట్టేందుకు కూడా ఆరోజుల్లో తమ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడ్డప్పుడు రెండేళ్లపాటు ఆయన  టీచర్లే తన ఫీజు చెల్లించారని గుర్తుచేసుకున్నాడు.  సిటీకి వచ్చిన కొత్తలో తానొక చిన్న ఇంట్లో ఉండేవాడినని, తన వంతుగా రూ. 7వేలు కట్టాలి అన్నాడు.  నెలరోజుల పాటు సిటీలో గడపాలంటే కనీసం రూ. 15 నుంచి 20 వేల రూపాయలు అవసరమయ్యేవి.

 అలాంటి సమయంలో ఒకానొక రోజు నా బ్యాంకు అకౌంట్లో 18 రూపాయలు మాత్రమే ఉన్నాయని నోటిఫికేషన్‌ వచ్చింది.  అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. నటన మీద ఉన్న ఆసక్తితో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జాయిన్‌ అయ్యాను.  అప్పుడు కనీసం సరైన బట్టలు కొనుక్కునేందుకు కూడా నా దగ్గర డబ్బులేదు.  నా స్నేహితుడి ఇంట్లో ఉంటూ అడిషన్స్‌ కోసం తిరిగీ తిరిగీ ముఖాలు వాడిపోయేవి.


 రాగానే రోజ్‌ వాటర్‌తో ముఖం కడుక్కుని.. పర్లేదు మనం కూడా బాగానే ఉన్నాం అని సంబరపడిపోయేవాడట.  ఇలా తన  ప్రయత్నాలు కొనసాగుతుండగా 2010లో సినిమా అవకాశం వచ్చింది అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నాడు.
ఈ రోజు ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు బీ-టౌన్‌ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నానన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: