సినీ తారల చర్మ సౌందర్య రహస్యంగా తరతరాలుగా పేరుగాంచిన లక్స్ సోప్ బ్రాండ్ అంబాసిడర్లుగా సమంత సిద్ధార్ధులు లక్స్ సోప్ ను ప్రమోట్ చేయబోతున్నారు. వీరిద్దరి పై లక్స్ యాజిమన్యం ఈమధ్య ఒక ప్రచార చిత్రాన్ని చిత్రీకరించామని లక్స్ యాజిమన్యం ప్రకటించింది. వచ్చే నెల ఒకటవ తారీఖు నుండి ఈ ఎడ్వటైజ్ మెంట్ ను దక్షణ భారత దేశంలోని అన్ని ప్రముఖ చానళ్ళ లోను ప్రసారం చేస్తామని ఈ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియచేసింది.  స్విడ్జర్ లాండ్ కు చెందిన ఐవో వెజ్ గార్డు దర్సకత్వంలో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించామని ఈ సంస్థ యాజమాన్యం తెలుపుతోంది. ‘ఘర్షణ’ సినిమాలోని నిన్నే నిన్నే పాటను ఈ యాడ్ కోసం రీమిక్స్ చేసామని ఈ సంస్థ తెలుపుతోంది. సమంత మటుకు అనుకోని ఈ అవకాసం ఒక మల్టీ నేషనల్ కంపెనీకి తన ప్రియ నేస్తం సిద్దార్ధ తో కలిసి నటించే అవకాసం వచ్చినందుకు తెగ సంబర పడిపోతోంది.  సమంతకు ఇప్పటికే పెళ్లి జరిగిపోయింది అనే వార్తలు తెగ వస్తున్న నేపధ్యంలో సమంతా సిద్ధార్దులు ఇలా ప్రేమికులుగా లక్స్ సోప్ ద్వారా నటించి మెప్పించడం వారికి ఆనందాన్ని కలుగచేసే న్యూస్ అనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: