ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. నాలుగు కోట్లమందికి పైగా చూస్తున్నారు ఈ బిగ్‌బాస్‌ షోని. వారం వారం హోస్ట్ గా నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే.

 

అయితే మన్మథుడు 2 చిత్రంతో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు మొదలు పెట్టాలని వున్నా కానీ బిగ్‌బాస్‌ ఫినాలే అయిపోయే వరకు కథలు కూడా విననని తనకోసం ఎదురు చూస్తోన్న దర్శకులకి చెప్పేసారు.

 

మరోవైపు అఖిల్‌ కెరియర్‌ని మలిచే బాధ్యతలని అల్లు అరవింద్‌ చేతిలో పెట్టేసారు. అతడిని సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెట్టమని చెప్పి సదరు చిత్రం గురించిన ఏ విషయంలోను నాగార్జున అసలు ఇన్‌వాల్వ్‌ అవడం లేదు.

 

బిగ్‌బాస్‌ ఫినాలే అక్టోబర్‌ 3న జరుగుతుంది. అది కాస్త లెంగ్తీ ఈవెంట్‌ కనుక నాగార్జున ఈలోగా ఎలాంటి స్ట్రెస్‌ తీసుకోవడం లేదు. కనీసం సినిమా కూడా ఒకే చేయలేదు. మొత్తం ఫోకస్ బిగ్గబోస్ పైనా పెట్టినట్లు సమాచారం.

 

కానీ నాగార్జున కనీసం ఎపిసోడ్లు చూడకుండా వచ్చేస్తున్నారని, స్క్రిప్ట్‌ ఫాలో అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ షో పేరు చెప్పి నాగార్జున పెయిడ్‌ హాలిడే ఎంజాయ్‌ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి.అందుకే అని పనులు పక్కన పెట్టి బిగ్‌బాస్‌ మీద కాంసెంట్రేట్ చేశారు అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: