గత కొంతకాలంగా తమిళ సినిమాలు ఒక్కటి కూడా తెలుగులో హిట్ కాలేదు. సూపర్ స్టార్ రజనీ సినిమాలు మూడు వరుసగా తెలుగులో ఫ్లాప్ గా మిగిలాయి. అలాగే సూర్య సినిమాలు కూడా ఫ్లాప్ అవుతు వస్తున్నాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న చివరి తమిళ డబ్బింగ్ సినిమా ఉందా అంటే టక్కున గుర్తొచ్చే సినిమా ఏదీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి సందర్భంగా 25 న రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్'.. కార్తి నటించిన 'ఖైది'.

అన్న సూర్య సినిమాలు మాదిరిగా కార్తి సినిమాలు కూడా తెలుగులో వరసబెట్టి ఫ్లాపులు అవుతున్నాయి. ఇప్పుడు 'ఖైది' సినిమా కూడా తమిళంలో అద్భుతం అంటే తప్ప తెలుగులో హిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక విజయ్ 'బిగిల్' డబ్బింగ్ వెర్షన్ 'విజిల్' విషయానికి వస్తే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా కొన్ని అంశాలు మాత్రం సక్సస్ కి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి విజయ్ హీరోయిజం. విజయ్ తమిళనాట పెద్ద స్టార్ కాబట్టి ఆయన మేనరిజం.. ఆ స్టైల్ చూసి తమిళ ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి. అయితే అది తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది కాస్త అనుమానమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమా ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. తమిళనాట ఫుట్ బాల్ కు ఆదరణ ఎక్కువ. 

అదే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి 'సాకర్' అనే పేరు కూడా తెలీదు. గేమ్ రూల్స్ చెప్పమంటే పదిమందిలో తొమ్మిది మంది చెప్పలేరని అర్థమవుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ మనకు కనెక్ట్ అయ్యే అంశం అసలు కాదనిపిస్తుంది. వీటికి తోడు వయసుమళ్ళిన రాయప్ప గెటప్.. ఆ మాస్ బ్యాగ్డ్రాప్ అంతా తమిళ నేటివిటీతో ఉంది. కొంతవరకూ తమిళ నేటివిటీ అంటే మన ప్రేక్షకులు భరించగలరేమో కానీ పూర్తిగా తమిళ నేటివిటీ అంటే మనవాళ్ళకి పిచ్చెక్కడం ఖాయం. ఇవన్నీ చూస్తుంటే 'విజిల్' తో విజయ్ కి తెలుగులో విజయం అంత ఈజీగా దక్కదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అందరి అంచనాలను తారుమారు చేస్తు విజయం సాధిస్తుందా లేదా అనేది ఇంకో రెండు రోజుల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: