వారసులుగా వచ్చిన వారిలో ఎక్కువమంది నిలబడలేకపోయారు. కొంతమంది మాత్రమే ఆ ఖ్యాతి నిలుపుకున్నారు. ఇక టాలీవుడ్లో ఇలా వచ్చిన వారిలో ఎక్కువ మంది స్టార్ హీరోల కొడుకులే ఉన్నారు. తొలిగా అన్న నందమూరి కుమారుడు బాలక్రిష్ణ నట వారసుడిగా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ సాధించారు. ఇక ఆ తరువాత వరసలో అనేక మంది వచ్చేశారు. అయితే ఎందరు వచ్చినా టాలెంట్ చూపించకపోతే ఇక్కడ ప్లేస్ ఉండదన్నది నిజం.


ఇదిలా ఉంటే రెబల్ స్టార్ క్రిష్ణంరాజు నట వారసునిగా ప్రభాస్ వచ్చాడు. కానీ అప్పటికే క్రిష్ణంరాజు హీరో పాత్రలు వేయడం మానేశారు. ఆయన స్టార్ డం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇక ప్రభాస్ ఆయన తమ్ముడు సూర్యనారాయ‌ణరాజు కుమారుడు. 2003లో ఈశ్వర్ మూవీ ద్వారా వెండి తెర అరంగేట్రం చేసిన ప్రభాస్ లో మొదటి సినిమాలోనే ఈజ్ ఉందని గుర్తించారు. ఆ తరువాత ఏడాది అంటే 2004లో వర్షం మూవీతో టాప్ హిట్ కొట్టారు.


ఇక 2005న చత్రపతి మూవీ రాజమౌళి కాంబోలో చేశాడు. దాంతో స్టార్ హీరో గా సెటిల్ అయ్యాడు. అక్కడ నుంచి ప్రభాస్ పరుగు ఆగలేదు. హిట్లూ ఫట్లు సంబంధం లేకుండా ప్రభాస్ దూసుకుపోతూ వచ్చాడు. ఇక ప్రభాస్ అన్ని సినిమాలు ఒక ఎత్తు, బాహుబలి పార్ట్ వన్, టూ మరో ఎత్తు. ఈ రెండు మూవీస్ ప్రభాస్ మొత్తం కెరీర్ ని మలుపు తిప్పేశాయి.


దెబ్బకు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. సాహో బాలీవుడ్లో టాప్ హిట్ గా నిలిచిందంటే దానికి కారణం  బాహుబలి అని చెప్పాలి. ఇపుడు ప్రభాస్ జాన్ మూవీ చేస్తున్నారు. తరువాత వరసగా మూవీస్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ కెరీర్ ఇపుడు టాప్ లెవెల్లో ఉంది. కొన్నాళ్ళ పాటు అది అలాగే కొనసాగుతుంది. దానికి వచ్చిన ఇబ్బంది లేదు.


ఇపుడు అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియన్స్, ఆయన పెదనాన్న క్రిష్ణంరాజు సైతం ఒక్కటే కోరుకుంటున్నారు. ప్రభాస్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడు కావాలన్నది అందరి కోరిక. ఈ పుట్టిన రోజుకు నాలుగు పదులు వాడు అయిన ప్రభాస్ పెళ్ళికి ఇదే సరైన సమయం అని గుర్తు చేస్తున్నారు. మరి ప్రభాస్ అందరి కోరికా తీరుస్తాడా.



మరింత సమాచారం తెలుసుకోండి: