చాలారోజుల తర్వాత తెలుగులో వచ్చిన సహజమైన చిత్రం ఏదైనా ఉందంటే అది కంచరపాలెం అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం దర్శకుడు కంచరపాలెం అనే ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి అక్కడి మనుషులని పరిశీలించి వారినే నటులుగా తీసుకుని కథని రాసుకున్నాడు. అందులో నటించిన ప్రతీ ఒక్కరు ఆ ఊరి వారే కావడం విశేషం. ఈ సినిమా తెలుగులో వచ్చిన ఒక సహజమైన చిత్రం అని చెపవచ్చు.


అయితే కంచరపాలెం చిత్రం విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు  దక్కించుకుంది.త‌క్కువ బ‌డ్జెట్లో, ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చి ఈ సినిమా తీసి మెప్పించిన వెంక‌టేష్‌.. త‌న‌కింత గుర్తింపు వ‌చ్చాక ఎలాంటి సినిమా తీస్తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమాలో సహజత్వంతో మెప్పించిన దర్శకుడు వెంక‌టేష్ తన తర్వాతి చిత్రం రీమేక్ ఉండబోతుందని సమాచారం.


మ‌ల‌యాళంలో మూడేళ్ల కింద‌ట విడుద‌లై మంచి విజ‌యం సాధించిన మ‌హేషింటె ప్ర‌తీకారం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడ‌ట‌. ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా దిలీష్ పోత‌న్ రూపొందించిన ఈ చిత్రం మ‌ల‌యాళంలో క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. దీన్ని త‌మిళంలో నిమిర్ పేరుతో ఉద‌య‌నిధి స్టాలిన్ హీరోగా ప్రియ‌ద‌ర్శ‌న్ రీమేక్ చేయ‌డం విశేషం. ఇప్పుడీ చిత్రాన్ని స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో వెంక‌టేష్ మహా రీమేక్ చేస్తున్నాడ‌ట‌. 


చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కావ‌చ్చింద‌ని.. త్వ‌ర‌లోనే సినిమా విశేషాలు పంచుకుంటార‌ని స‌మాచారం. అయితే కంచరపాలెం తీసిన వెంకటేష్ రీమేక్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.అంత ఒరిజినాలిటీతో తీసిన దర్శకుడు సడెన్ గా రీమేక్ చేయడం సరి కాదని భావిస్తున్నారు. ఏది ఏమైనా రీమేక్ కి వెళ్ళకుండా డైరెక్ట్ సినిమా తీస్తే ఇంకా బాగుండేదని అభిప్రాయం. మరి వెంకటేష్ ఈ రీమేక్ తో మెప్పిస్తాడా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: