చిరంజీవి కోసం దాదాపు ఏడాది పైగా ఎదురు చూసిన కొరటాల శివకు చిరంజీవితో సినిమా మొదలై నెలరోజులు కాకుండానే రామ్ చరణ్ నుండి వచ్చిన కండిషన్స్ కొరటాలకు ఊహించని షాక్ ఇచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు నవంబరు నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న కొరటాల మూవీని నిర్మిస్తున్న చరణ్ కోరతాలకు స్పష్టమైన కండిషన్స్ పెట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీ నిర్మాణ విషయంలో ఖర్చు విషయంలో ఏమాత్రం అలసత్వం తాను సహించను అనీ ‘సైరా’ బడ్జెట్ విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదనీ చరణ్ కొరటాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి వేసే సెట్స్ విషయంలో అదేవిధంగా నటీనటుల విషయంలో భారీ తనం కనిపించాలి కాని ఎక్కువ ఖర్చు ఉండకూడదు అని చరణ్ కొరటాలకు స్పష్టమైన సంకేతాలు పెట్టినట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా ఈ మూవీ నిర్మాణ విషయంలో ఎక్కడా ఆలస్యం జరగ కూడదనీ ఈ మూవీని ఆరు నెలలు లోగా పూర్తి చేసి అన్నీ కుదిరితే ఈ మూవీని మే నెల నెలాఖరుకు విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకోమని చరణ్ కొరటాలకు సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అనుకోని కండిషన్స్ కు షాక్ అయిన కొరటాల ఈ మూవీ బడ్జెట్ లో ఎక్కడ వృథా జరుగుతోంది అన్న విషయమై లోతుగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి చరణ్ కు ఈ జ్ఞానోదయం అంతా ‘సైరా’ వల్ల కలిగింది అన్న సంకేతాలు వచ్చినా ఇలా ఎక్కువ కండిషన్స్ చరణ్ కొరటాల పై పెడితే ఆ టెన్షన్ లో కొరటాల ఈమూవీ క్వాలిటీ విషయంలో పొరపాట్లు చేసే ఆస్కారం ఉంది అని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ సంగీత దర్శకుడుని కొరటాల ఫిక్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే ఇప్పుడు చరణ్ లేటెస్ట్ కండిషన్స్ తో కొరటాల కన్ఫ్యూజ్ అవుతాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: