తమిళ టాప్ హీరోలు సామాజిక విషయాల పై స్పందించే తీరుపై ఇప్పటికే అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ మధ్య తమిళనాడులో ఒక ఫ్లెక్సీ హోర్డింగ్ కూలి ఒక యువతి మరణించడం అక్కడ సంచలన విషయంగా మారడంతో ఆ రాష్ట్రంలో ఫ్లెక్సీలు హోర్డింగుల పై తీవ్ర వ్యతిరేకత ప్రజలలో వ్యక్తం అవుతోంది. 

దీనితో ఇలాంటి ఫ్లెక్సీల సంస్క్రతికి చరమ గీతం పాడమని తమ ఫ్యాన్స్ ఎవరూ తమ సినిమాలకు బర్త్ డే లకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని అక్కడి స్టార్ హీరోలు  పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా విజయ్ అజిత్ లాంటి హీరోలు రంగంలోకి దిగి తమ అభిమానులను ఫ్లెక్సీలకు దూరంగా ఉండమని పిలుపు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల ఈ దీపావళికి రాబోతున్న విజయ్ 'బిజిల్' సినిమాపై విజయ్ అభిమానుల స్పందన ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.  

ప్రస్తుతం విజయ్ అభిమానులు తమ హీరో కోసం తమిళనాడులో ఎక్కడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. అంతేకాదు తమిళ నాడులో కొన్నిచోట్ల  విజయ్ అభిమానులు డబ్బులు వేసుకుని ప్రజలకు పనికి వచ్చే పనులు చేస్తున్నారు. అందులో భాగంగా పబ్లిక్ ప్లేస్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు దీపావళి రోజున స్లమ్ ఎరియాలోకి వెళ్ళి పేద పిల్లలకు బట్టలు పంచి పెట్టడంతో పాటు వారికి స్వీట్స్ అదేవిధంగా బాణసంచా ఇచ్చే కార్యక్రమాలను చేపడుతున్నారు. 

ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చును విజయ్ అభిమానులు మాత్రమే కాకుండా విజయ్ కూడ భరిస్తూ ఉండటం అతడి మంచి మనసుకు నిదర్శనం అంటూ తమిళ మీడియా వార్తలు రాస్తోంది. మరి ఇలాంటి మంచి మనసు మన టాలీవుడ్ టాప్ హీరోలకు కూడ ఉంటే ఎంత బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: