బాహుబలి తర్వాత ప్రభాస్ పాపులారిటీ రాష్ట్రాలు దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. బాహుబలి ఇచ్చిన విజయం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను తన కెరియర్ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా చాలా సందర్భాలలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఈ క్రమంలో అక్టోబర్ 23 వ తారీఖున ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ తన అభిమానులకు జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో వినపడుతున్న టాక్. బాహుబలి వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా చేయడం జరిగింది.


దాదాపు రెండు సంవత్సరాలపాటు 'సాహో' సినిమా కి తన టైం కేటాయించడం చివరాకరికి సినిమా విడుదలయ్యాక మొట్టమొదటి రోజే ఫ్లాప్ టాక్ రావటంతో తీవ్ర నిరుత్సాహానికి ప్రభాస్ మరియు అభిమానులు గురయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ‘సాహో’ సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ మాత్రం టైం తీసుకోకుండా డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. అయితే ఈ సినిమా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ రెండు విధాలుగా కనబడబోతున్నట్లు సమాచారం.


కాగా ప్రస్తుతం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా లండన్ లో బాహుబలి టీం తో తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుండగా...ప్రభాస్ తన అభిమానులకు తన పుట్టిన రోజు సందర్భంగా రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ విడుదల చేస్తున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా టైటిల్ పేరు కోసం వెయిట్ చేస్తున్నారు మరియు అదే విధంగా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: