బిగ్ బాస్ చివరి దశకి వచ్చేసింది. ఇంకొక్క వారం ఆగితే టైటిల్ విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. ఈ వారం టికెట్ టు ఫినాలే గెలువుకుని రాహుల్ ఫైనల్ కి చేరుకున్నాడు. మొన్నటి వరకు టైటిల్ ఫేవరేట్లలో శ్రీముఖి, రాహుల్ పేర్లు వినిపించాయి. అయితే సడెన్ గా మరో రెండు పేర్లు కూడా టైటిల్ రేసులోకి వస్తున్నాయి. ఆ ఇద్దరు కంటెస్టెంట్ టైటిల్ రేసులో దూసుకుంటూ వస్తున్నారు. వారే బాబా భాస్కర్, వరుణ్. 


వరుణ్ కి సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అదీ గాక జెన్యూన్ గా ఆడతాడనే మంచి పేరుంది. అదీ గాక బిగ్ బాస్ హౌస్ కి జంటగా వచ్చిన వరుణ్, వితికాల జంట నుండి వితికా పొయిన వారం ఇంటి నుండి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే వితికా వెళ్ళినప్పటి నుండి వరుణ్ కి ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. వితికాని అభిమానించే వారు కూడా కలవడంతో అతనికి చాలా ప్లస్ అయింది. ఇక బాబా భాస్కర్ విషయానికి వస్తే, టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆలీతో పోరాడినప్పటి నుండి అతని గ్రాఫ్ పెరిగిపోయింది. గెలుస్తామా, ఓడిపోతామా అనే విషయాన్ని పక్కన పెట్టి టాస్క్ ఆడాడు.


అతని పోరాట పటిమకు ప్రేక్షకులు జై కోడుతున్నారు. అంతే కాదు గేమ్ లో తనని ఆలీ హింస పెట్టినా తాను మాత్రం కూల్ గా ఆడుతూ, హింస పెట్టినట్లు కంప్లైంట్ కుడా చేయలేదు. దీంతో అతని పట్ల విపరీతమైన అభిమానం పెరిగింది. అందువల్ల టైటిల్ విన్నర్ రేసులో రాహుల్, శ్రీముఖిలను వెనక్కి నెట్టి ముందు వరుసలో కూర్చున్నాడు. అయితే వరుణ్ కూడా టైటిల్ రేసులో ఉన్నప్పటికీ, బాబా భాస్కర్ టైటిల్ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: