బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ భిన్నమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. అయితే తాజాగా సాహో సినిమాతో టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే టాలీవుడ్ స్టార్ హీరో ప్రబాస్  పక్కన చాన్స్ కొట్టేసింది . అయితే వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు . ఓ వైపు తన అందాలతో ప్రేక్షకుల మతి పోగొడుతునే ... మరోవైపు తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది  శ్రద్ధ కపూర్. 

 

 

 

 ప్రస్తుతం డాన్స్ నేపథ్యంగా సాగే స్ట్రీట్ డ్యాన్సర్ 3డిలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. అయితే టైగర్ షాప్ తో నటించిన  భాగీ 3 కూడా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇలా డిఫరెంట్ జోనర్ కథలను ఎంచుకుంటూ... నటిగా  అన్ని రకాల పాత్రల్లో  ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది శ్రద్ధాకపూర్. ఇక ప్రభాస్ నటించిన సాహో లో కూడా తన నటనతో మెప్పించింది. అయితే ఒక నటి అయిన తరువాత అన్ని పాత్రలు చేయాల్సిందేనని... తనకి వైవిధ్యమైన పాత్రలు వస్తున్నాయని శ్రద్ధ కపూర్ తెలిపింది. 

 

 

 

  అయితే చాలామంది సినిమా హీరో హీరోయిన్ లు  స్టార్ ఇమేజ్ తో  విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు అని అనుకుంటారు. అయితే శ్రద్ధ కపూర్ మాటలు వింటే మాత్రం మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే .అయితే ఆమె అనుభవిస్తున్న స్టార్ ఇమేజ్ వలన చాలా కోల్పోయాను అని అంటుంది శ్రద్ధ కపూర్ . సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా బయటికి వెళ్లేదాన్ని ...  ముంబై కార్టర్ రోడ్లలో  తిరిగేదాన్ని కానీ ఇప్పుడు హీరోయిన్ గా మారిన తర్వాత అదంతా కుదరటం  లేదని ఫీల్ అవుతుంది ఈ అమ్మడు . స్నేహితులతో కలిసి కాఫీ షాప్, సేవ్ పూరి ఇలా ఎన్నో ఆశలు తనకి ఉన్నాయని ... కానీ సెలబ్రిటీ గా  మారిన తర్వాత ఇవన్నీ కుదరడం లేదని శ్రద్ధాకపూర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: