పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమాలో నటించిన భామ కృతి కర్బందా. సుమంత్ హీరోగా రమణ గోగుల నిర్మించిన బోణీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. పవర్ స్టార్ సినిమా చేసినా సరే హిట్టు పడలేదు అంటే అమ్మడి బ్యాడ్ లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


సౌత్ లో పని అవదని గుర్తించిన ఈ బ్యూటీ చిన్నగా బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా సోసోగానే కెరియర్ సాగిస్తుంది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కృతికి హిందిలో అవకాశాలు మాత్రం వస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్ ఫుల్ 4 సినిమాలో నటించిన కృతి బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.


ఆల్రెడీ పులక్తి కు పెళ్లవడం మళ్లీ అతని భార్య శ్వేతా రోహిరాతో విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. వీరిద్దరి పెళ్లి బంధం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే నిలబడ్డది. ఇదిలాఉంటే పులకిత్ తో కృతి కర్బంధా వీరే కి వెడ్డింగ్ సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ అవడంతో మళ్లీ అదే జోడీతో పాగల్ పంటీ సినిమాలో తీసుకున్నారు.


ఈ మూవీ టైంలో పులకిత్ తో కృతి చాలా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఎక్కడ చూసినా ఇద్దరు కనిపిస్తున్నారట. కృతి కోసం పువ్వులు, చాక్లెట్లు ఇలా చాలా రకాల సర్ ప్రైజ్ లు ఎప్పుడు ఇస్తున్నాడట పులకిత్. చూస్తుంటే ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టే అనిపిస్తుందని ముంబై మీడియా వర్గాల సమాచారం. అయితే క్రేజీ కపుల్స్ కృతి పులకిత్ ఈ సీక్రెట్ రిలేషన్ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: