ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో దివంగత నటి మరియు దర్శకురాలైన శ్రీమతి విజయనిర్మల గారి తనయుడు సీనియర్ నరేష్ అధ్యక్షులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిజానికి ఆ ఎన్నికల సమయంలోనే ఒక వర్గంపై మరొక వర్గం వారు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం జరిగింది. అయితే ఎలాగో చివరికి ఎన్నికలు పూర్తి అవడం, ఆ తరువాత నరేష్ గారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే 'మా' లో పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్నా తరుణంలో మొన్న జరిగిన ఒక మీటింగ్ కారణంగా మళ్ళి విబేధ చిచ్చు రాజుకుంది. అయితే దానికి అసలు కారణం ఏంటంటే, ఇటీవల రెండు రోజుల క్రితం అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు ఒక జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు.   

అలానే మీటింగ్ విషయమై సభ్యులకు సమాచారం అందించడంతో అందరూ హజరయ్యారు. ఇదే అసలు సమస్యకు కారణభూతంగా నిలిచింది. ఈ మీటింగ్‌పై మా అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం ఇవ్వకుండా జీవిత గారు, రాజశేఖర్ గారు ఎలా మీటింగ్ నిర్వహిస్తారు అంటూ నరేష్ గారి తరుపు న్యాయవాది వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు, ఇదికేవలం ఫ్రెండ్లీగా జరిగిన క్యాజువల్ మీటింగ్‌ మాత్రమే అని, ఇటీవల కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏమాత్రం కాదని అన్నారు. అయితే ఈ మీటింగ్‌లో గత తొమ్మిది నెలలో నరేష్‌ అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత తీసుకున్న నిర్ణయాలపై సభ్యులందరితో జీవిత, రాజశేఖర్ దంపతులు చర్చించినట్లు సమాచారం. 

అయితే ఈ మీటింగ్ కి అసలు కారణం, గత కొద్ది రోజులుగా నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య వివాదాలు జరగుతుండడమే అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రోజు అధ్యక్షులు నరేష్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి  జీవిత, రాజశేఖర్ గారి మీటింగ్ గురించి ప్రస్తావించడంతో వాదన మరింత ముదిరి పాకాన పడింది. అయితే ఈ వివాదంపై ఇప్పటికే అధ్యక్షులు నరేష్‌కు రాజశేఖర్‌ గారు తన వర్గ సభ్యులతో కలిసి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చడంతో, మరికొద్దిరోజుల్లో మా యూనియన్ రెండుగా చీలడం ఖాయమని కూడా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వివాదం విషయమై మున్ముందు జరుగుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: