తమిళ స్టార్ హీరో  విజయ్ -యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ  బిగిల్. మచ్ అవైటెడ్ విడుదలకానున్న ఈ చిత్రం పై తమిళ్ తోపాటు  తెలుగులోనూ  భారీ అంచనాలు వున్నాయి. తెలుగులో ఈ చిత్రం  విజిల్ పేరుతో విడుదలవుతుంది.  ఈ సందర్బంగా ఈరోజు హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన  ప్రెస్ ఈవెంట్  కు  అట్లీ  మరియు  సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ఇతర నటీనటులు హాజరైయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో  అట్లీ   ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 




నా ప్రతి సినిమా విడుదల తరువాత ఎన్టీఆర్ సర్ నుండి  నాకు  ఫోన్ వస్తుంది. సినిమా చాలా అద్భుతంగా తీశావు  అని అభినందిస్తారు. ఆయన ఎంకరేజ్ చేయడం ఆనందంగా  అనిపిస్తుంది.  అలాగే  విజిల్  తమిళ్ లో కంటే  తెలుగులోనే పెద్ద హిట్ అవుతుందని  అట్లీ వెల్లడించాడు. ఇక ఎన్టీఆర్ - అట్లీ  కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి కూడా హింట్ ఇచ్చాడు అట్లీ. త్వరలోనే  ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ లో సినిమా ఉంటుందని  చెప్పకనే చెప్పాడు.  ఇదిలా ఉంటే  విజిల్  తెలుగు రాష్ట్రాల్లో  ఏకంగా  700 స్క్రీన్ లలో విడుదలకానుంది.  పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు. దీపావళి కానుకగా  ఈ నెల 25న ఈ చిత్రం విడుదలకానుంది.  స్పోర్ట్స్  బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో నయనతార  కథానాయికగా నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. సుమారు 180కోట్ల బడ్జెట్ తో  ఎజిఎస్  ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: