కమెడియన్  అలీ  చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. కామెడీ పంచడంలో అలీది  ఒక సెపరేట్ స్టైల్. అందరికంటే భిన్నంగా కామెడీని పంచుకుంటాడు. తనదైన మేనరిజంతో కామెడీ చేసే... ప్రేక్షకులకు నవ్వుల గిలిగింతలు పెడతారు అలీ . అంతేకాదు సినిమాల్లో నచిమి అంటూ లేడీ గెటప్ వేసి అదరగొట్టగలడు అలీ . అలీతో సరదాగా అంటూ టీవిలో  వ్యాఖ్యాతగా మారి దుమ్మురేపే సత్తా అలీ  సొంతం . కమెడియన్ గా  వ్యాఖ్యాతగా తనదైన స్టైల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు అలీ. అయితే ఓక కమెడియన్ గా  అలీకి క్రేజ్ ఎక్కువ ఉండటం తో  పాటు కాంట్రవర్సీలు కూడా చాలా ఎక్కువ. నోరు తెరిస్తే చాలు ఏదో ఒక వివాదాన్ని తెరమీదకు తెస్తుంటారు అలీ.  




 ఇప్పటికే  గతంలో ఎన్నోసార్లు అలీ  నోరుజారి ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో సారి సినిమా  రివ్యూ రైటర్ లపై నోరు పారేసుకోవడం తో ప్రస్తుతం అలీ  వ్యాఖ్యలు సంచలనం గా మారాయి . సినిమా ఎలా ఉందో డిసైడ్ చేయడానికి మీరు ఎవరు చూడడానికి ప్రేక్షకులు ఉన్నారు... వాళ్లకు తెలుసు ఏ సినిమా ఎక్కడ పెట్టాలో...  మధ్యలో మీరెవ్వర్రా కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు  అంటూ  అసభ్య పదజాలంతో రివ్యూ రైటర్స్ పై విరుచుకుపడ్డారు కమెడియన్ అలీ. అయితే అలి  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం  సంచలనంగా మారాయి .సినిమా రివ్యూ రాసే  రైటర్స్  పై సినిమా వాళ్లకు ఎందుకింత చిన్నచూపు అని  మండిపడుతున్నారు రివ్యూ రైటర్స్. 



 రివ్యూ రైటర్స్ ఏమీ రాయకుండానే నువ్వు  ఈ స్థాయికి వచ్చావా  అంటూ అలీకి  కౌంటర్ ఇస్తున్నారు. ఒకరిని అనే ముందు నీది  నువ్వు చూసుకో  అంటూ సెటైర్లు వేస్తున్నారు. రివ్యూ రైటర్స్ నీ గురించి పాజిటివ్  వార్తలు రాయడం వల్లే ఇంత  స్టార్ గా అయ్యావని గుర్తుంచుకో అంటూ  ఫైర్ అవుతున్నారు రివ్యూ రైటర్స్. కమెడియన్ అలీ చేసిన కామెంట్స్ తో  ఇండస్ట్రీలోని కొందరు సీనియర్ జర్నలిస్టులు కూడా హర్ట్ అయినట్లు తెలుస్తుంది. రివ్యూ రైటర్లపై  మీడియా ముందు ఇలాంటి సంచలన కామెంట్లు చేయడం సమంజసం కాదంటున్నారు. సినిమాలు బాగున్నప్పుడు రివ్యూ లు  తీసుకుని పోస్టర్స్ పైన  వేసుకునేవారు బాగోలేనప్పుడు ఎందుకు తీసుకోలేక పోతున్నారు  అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే దీనిపై అలీ  ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: