టాలీవుడ్ హీరో ప్రభాస్ బర్త్ డే ఈరోజు. ఆరడగుల బుల్లెట్.. అందం, అభినయం ఆయనకే సొంతం.నేటితో టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ 40వ పడిలోకి అడుగుపెడుతున్నారు .ఈ సందర్భంగా ప్రభాస్‌కు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుని.. సాహో సినిమాతో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ పుట్టిన రోజు నేడు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం నుంచే ట్వీట్లు మొదలయ్యాయి. ఆ దెబ్బకు కొన్ని క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ ట్విట్టర్‌లో ఫుల్  ట్రెండ్ అయింది. జాతీయ స్థాయిలో ప్రభాస్ అభిమానులుండటం.. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవడంతో డార్లింగ్ అభిమానులు సంబరపడిపోయారు.

సోషల్ మీడియాలో  ఊపేస్తున్న ట్వీట్లు... టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు ప్రభాస్‌కు  తమ విషెస్ తెలుపుతున్నారు.అటు  నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు ఇలా  అనేక  మంది పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతున్నారు.మెగా తనయుడు చెర్రీ,వెరైటీగా విషెస్ చెప్పారు. సాహో సినిమాలోని బ్యాడ్ బాయ్ సాంగ్ ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే,బ్యాడ్ బాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహ మహోత్సవంలో డ్యాన్స్ చేస్తోన్న పిక్‌ను పోస్ట్ చేసారు చెర్రీ.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వీరాభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బాహుబలికి.. భల్లాలదేవ రానా కూడా తన విషెస్ చెప్పారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా...లవ్ యూ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రానా రాసారు. ఈ సందర్భంగా.. ఈ క్యాప్షన్‌కు గాను ప్రభాస్‌తో తాను ముచ్చటిస్తుండగా బాహుబలి నవ్వుతూ ఉన్న ఓ ఫోటోను కూడా షేర్ చేసి ,పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: