డైనమిక్ లేడీ మంచు లక్ష్మి హీరోయిన్ గా చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక గతం లో నిర్వహించిన ప్రేమతో మీ లక్ష్మీ అన్న టీ.వి షో బాగా సక్సస్ అయింది. ఇందులో భాగంగానే ఇక కొత్తగా నిర్వహిస్తున్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో ఈమధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలను అతిథులుగా పిలిచి బాలీవుడ్ చాట్ షోల మాదిరిగా బోల్డ్ స్టైల్ లో కార్యక్రమాన్ని నిర్వహించడం కొంతమందిని బాగానే అట్రాక్ట్ చేసింది. ఈ షోలోనే సమంత తమ వివాహానికి ముందే చైతుతో లివింగ్ రిలేషన్ లో ఉన్నానని ఒక బాంబు పేల్చగా.. శృతి హాసన్ ఈ మధ్యనే మద్యం అలవాటును మానేసిన విషయం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇదే షో లో రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ తేజ్ కూడా, కాజల్ అగర్వాల్ చాలా ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. 

ఇలాంటి ఒకటి అరా అంశాలు ఓకె కానీ ఓవరాల్ గా 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా అనే ప్రశ్నకు సమాధానంగా ఫెయిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వూట్(వూత్) ప్లాట్ ఫాం ఎక్కువమందికి తెలియక పోవడం. ఇది 'సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్' విధంగా ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకుల్లో వూట్ కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఇందులోని కంటెంట్ ప్రేక్షకులకు అంతగా అర్థం అవడం లేదు. దీంతో మంచు లక్ష్మి షోకు సగానికి సగం మంది ప్రేక్షకులు దూరమయ్యారు. గతంలో లక్ష్మీ నిర్వహించిన ప్రేమతో మీ లక్ష్మీ, మేము సైతం ప్రోగ్రాంస్ బాగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కానీ 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' మాత్రం కాస్త నిరాశపరుస్తోంది. 

ఇక షోకు వచ్చే అతిథులను కొన్ని సెన్సేషనల్ ప్రశ్నలు వేసి.. షాకింగ్ సమాధానాలు రాబట్టినప్పటికి మొత్తం ప్రోగ్రాం చూస్తే మాత్రం అంత ఆసక్తికరంగా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  అందరికీ అందుబాటులో ఉన్న ప్లాట్ ఫాం అయితే ఇలాంటి కార్యక్రమాలకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అందులోనూ ప్రోగ్రాం అద్భుతంగా ఉంటేనే చూస్తారు. ఈ రెండూ లేకపోవడంతో 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమం ఆశించిన విజయం సాధించలేదని అంటున్నారు. మరి ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లోనైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేస్తే బావుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: