మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. వీకే నరేష్ మీడియాకు ఎక్కగా.. దానికి పోటీగా జనరల్ సెక్రటరి జీవిత, సభ్యులు హేమ, జయలక్ష్మీ ప్రెస్ మీట్ పెట్టి  మరి అధ్యక్షుడి తీరును పూర్తిగా కడిగి పారేశారు. చిరంజీవి హయాం నుంచి కొనసాగుతున్న మా బైలాస్ను ఎలా మారుస్తారు  అంటూ వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. తొలి ఈసీ మీటింగ్‌లోనే చాలా గొడవలు జరిగాయి.

అధ్యక్షుడు వీకే నరేష్ తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. తనకు నచ్చిన అడ్వకేట్‌ను పెట్టుకొని ఏకపక్షంగా వ్యవహరించారు.ఆ మీటింగ్‌లో మా సభ్యులు తక్కువ ఓట్లు వేసిన వ్యక్తులను, మా ఎన్నికల్లో గెలువని ఓ వ్యక్తిని కూడా సమావేశంలో కూర్చొపెట్టారు అని హేమ ఆగ్రహం వ్యక్తం చేసారు.శివాజీరాజా అధ్యక్షుడిగా ఉండగా గత కమిటీలో కార్యదర్శి హోదాలో నాకు కూడా హక్కు ఉందని వాదించారు. గత అధ్యక్షుడు శివాజీ రాజాను కాదని చెప్పి , వైస్ ప్రెసిడెంట్ హోదాలో మీరు ఎలా సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు మీకు హక్కు ఉందంటే,ఇప్పుడు జీవితకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదు  అని హేమ తీవ్రంగా మండిపడ్డారు.

మెజారిటీ మా సభ్యుల మద్దతు తమకు ఉందని చెప్తున్నారు. మా ఈసీ సమావేశం పెట్టేటప్పుడు తన 8 మందికి మెసేజ్‌లు పంపించి వీకే నరేష్ బెదిరించారు. కోర్టుకు ఈడుస్తారని, అరెస్ట్ చేస్తారని వారిని హెచ్చరించారు. 18 మంది ఇబ్బంది పడుతుంటే మాట్లాడటం వీలు కాలేదా? ఇప్పటి వరకు మీ మీద గౌరవం తోనే నేను సామరస్యంగా మాట్లాడాను. ఇప్పుడే అదే గౌరవంతో వివరణ ఇస్తున్నాను అని హేమ ప్రశ్నల వర్షం కురిపించారు మీడియాలో .

మా వివాదం తలెత్తినప్పుడు అప్పట్లో శివాజీరాజా, వీకే నరేష్ సమానంగా మద్దతు ఇచ్చాం.మాపై పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తారా? మీకు దావాలు వేసే సమయం ఉన్నప్పడు.. సమావేశానికి ఎందుకు రాలేదు. మీటింగ్ రావడానికి కూడా  టైం లేదా అని హేమ ఫైర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: