తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం "బిగిల్". విజిల్ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఎక్కడలేని హైప్ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. యూట్యూబ్ లో రెండు మిలియన్లు లైక్స్ వచ్చిన ట్రైలర్ గా రికార్డు పొందింది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25 వతేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.


ఇప్పటికే అట్లీ- విజయ్ ల కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. తెరి, మెర్సల్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ డూపర్ హీట్ అయ్యాయి. ఈ మూడో చిత్రం కుడా విజయం సాధిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని విజిల్‌ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. 


ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో… ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత మ‌హేష్ కొనేరు మాట్లాడుతూ – త‌మిళంలో ఇప్పుడు బిగిల్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో విజిల్‌కు అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇదేదో త‌మిళ సినిమా అనో.. ద‌క్షిణాది సినిమా అని చెప్ప‌డం కంటే ఇండియ‌న్ సినిమా అని చెప్ప‌డానికి సంతోష‌ప‌డుతున్నాను.


విజ‌య్‌గారు, అట్లీగారు గ‌త చిత్రాల ద్వారా తెలుగులో మంచి ఆద‌ర‌ణ‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేసే అవ‌కాశాన్ని నాకు ఇచ్చారు. ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి, కృతజ్ఞతలు తెలియజేశారు.డైరెక్ట‌ర్ అట్లీ మాట్లాడుతూ – నేను తెలుగులో సినిమా చేయాల‌ని చాలా కాలంగా క‌ల కంటున్నాను. త్వ‌ర‌లోనే ఆ క‌ల నేర‌వేర‌నుంది.  తెలుగు ప్రేక్ష‌కులు సినిమాని చాలా గొప్ప‌గా ప్రేమిస్తారు.


ఇక విజిల్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాను తెలుగులో 700 థియేటర్స్‌లో విడుద‌ల చేస్తుండ‌టం గొప్ప‌గా అనిపిస్తుంది. ఈ సినిమా కేవ‌లం ఫుట్ బాల్ స్పోర్ట్ గురించి  మాత్ర‌మే కాదు.. చాలా ఎమోష‌న్స్‌ను క్యారీ చేస్తుంది. అలాగే స్త్రీ సాధికార‌త‌ను తెలియ‌జేస్తుంది. ఈ సినిమాను మ‌హిళ‌ల‌కు అంకితమిస్తున్నాను అని తెలియజేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: