తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను కొద్ది సేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఒక ఫైనాన్షియర్ తనని మోసం చేసాడు అని బండ్ల గణేష్ పై కేసు పెట్టగా పోలీసులు అతని పై అరెస్ట్ వారెంట్ తో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిత్ర సీమలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారిన ప్రక్రియ అప్పట్లో ఎంతో మందిని ఎన్నో అనుమానాలకు గురి చేసింది. అదీ కాకుండా మొదట్లో అతని బ్యానర్ కు అన్నీ పరాజయాలు ఎదురైనప్పటికీ బండ్ల గణేష్ నిలదొక్కుకున్న తీరు అనుమానాలకు తావిచ్చింది.

అయితే పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ దశ తిరిగింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గణేష్ టెంపర్, బాద్షా, గోవిందుడు అందరివాడేలే లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఏమైందో ఏమో కానీ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న బండ్లగణేష్ రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ వైపు చేరి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత గణేష్ వ్యాపార వ్యవహారాలపై అనేకానేక ఆరోపణలు ఎదురయ్యాయి. ఇటీవలే ప్రొద్దుటూరుకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు అతను ఇచ్చిన చెక్కులు 40కిపైగా బౌన్స్ అయ్యాయని ఆరోపించారు కూడా.

ప్రస్తుతానికైతే బండ్ల గణేష్ ముంబైకి చెందిన ఒక ఫైనాన్షియర్ తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ముంబై కి సంబంధించిన ఫైనాన్షియర్ ను చీట్ చేసిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు గణేష్ ని అరెస్ట్ చేయగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో క్రేజీ క్యారెక్టర్ చేసిన బండ్ల గణేష్ భవిష్యత్తు ఈ అరెస్టుతో కొంచెం సంకటంగా మారింది అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: