కమెడియన్ ఆలీ అంటే తెలియని తెలుగు వారు లేరు. ఈ మధ్య చిన్న పిల్లలు సైతం ఆలీకి అభిమానులుగా మారారు. అయితే మన ఆలీ నవ్వులతో పాటు కాంట్రవర్సీలకు సైతం కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆలీ నోరు తెరిస్తే రచ్చ జరగడం ఖాయం. గతంలో చాలాసార్లు నోరు జారి వార్తల్లో ఎక్కిన ఆలీ మరోసారి తాజాగా రివ్యూవర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సినిమా ఎలా ఉందో డిసైడ్ చేయడానికి మీరెవరు.. చూడ్డానికి ప్రేక్షకులున్నారు.. వాళ్లకు తెలుసు ఏ సినిమాను ఎక్కడ పెట్టాలో.. మధ్యలో మీరెవ్వర్రా కోన్ కిస్కా గొట్టంగాళ్లు అంటూ రివ్యూ రైటర్స్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు ఆలీ.

ఆలీ చేసిన కమెంట్స్ కి హర్ట్ అయిన కొందరు అసలు సినిమా రివ్యూ రాసే వాళ్లపై ఎందుకు ఇండస్ట్రీకి ఇంత పగ అంటూ సోషల్ మీడియాలో పోస్టులను పెట్టేశారు. వాళ్లు లేకుండానే మీరు ఇంతదూరం వచ్చారా.. వాళ్లేం రాయకుండానే మీరు కెరీర్‌లో ఎదిగారా.. ఒకర్ని అనేముందు నీది నువ్వు ముందు చూసుకో అంటూ ఆలీ పై సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడూ అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడతావు.. పదిమందిలో ఉన్నా కూడా సరిగ్గా మాట్లాడే సభ్యత తెలీని నువ్వు.. మూవీ రివ్యూలు రాసే రైటర్స్ గురించి వాగుతున్నావ్ అంటూ ఆలీపై పంచులు వదిలారు.. 

 రివ్యూ రైటర్స్.. సినిమా జర్నలిస్టులు నిన్ను చూపించడం.. నీ గురించి రాయడం మానేస్తే నువ్వేం పీకుతావ్??  నీ గురించి పాజిటివ్ వార్తలు రాయకుండానే కెరీర్‌లో ఇంత స్టార్ అయ్యావా?? అంటూ రెచ్చిపోయారు. ఆలీ చేసిన వ్యాఖ్యలు విని ఇండస్ట్రీలో ఉన్న కొందరు సీనియర్ జర్నలిస్టులను కూడా బాధ పడ్డారు. సడన్‌గా కమెడియన్ ఆలీ చేసిన కమెంట్స్ చేయడం నిజంగానే షాక్ అంటున్నారు విశ్లేషకులు. గతంలో కూడా యాంకర్ సుమ, అనుష్క.. ఇలా తనకి దొరికిన అందరిపై కామెడీ పేరుతో అసభ్య పదజాలం వాడిన ఆలీ ఇప్పుడు మరోసారి రివ్యూ రైటర్లపై ప్రతాపం చూపించాడు. సినిమా బాగున్నపుడు రాసిన రివ్యూలు తీసుకుని పోస్టర్లపై వేసుకున్న వాళ్లు.. బాగోలేనపుడు ఎందుకు తీసుకోవు అనే ప్రశ్నకు ఆలీ సమాధానం చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: