తెలుగు సినిమా దర్శకుల్లో కృష్ణవంశీకి ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ కధ తీయాలన్నా, కాన్సెప్ట్ బేస్డ్ కథలు తీయాలన్నా, దేశభక్తి సినిమాలు తీయాలన్నా కృష్ణవంశీది అందె వేసిన చేయి. పాతికేళ్ల కెరీర్లో తీసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినిమాపై ఆయన వేసిన మార్క్ సామాన్యమైనది కాదు. కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ వంశీ ఇప్పుడు ఓ రీమేక్ సినిమాతో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది.

 


2016లో మరాఠీ భాషలో హిట్ అయిన నట సామ్రాట్ అనే సినిమాను రంగమార్తాండ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కృష్ణ వంశీ మళ్లీ తన మార్క్ చూపంచాలని తపిస్తున్నాడు. ఇందులో భాగంగా స్క్రిప్ట్ విషయంలో టాలీవుడ్ సీనియర్ అండ్ టాప్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ సాయం తీసుకుంటున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరాఠీ కథను తెలుగుకు తగ్గట్టు మార్పులు చేసి ఇవ్వాలని వారిని కోరినట్టు అందుకు పరుచూరి సోదరులు అంగీకరించి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కృష్ణవంశీ స్పందించాడు. రంగమార్తాండకు పరుచూరి సోదరులు కథను డెవలెప్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్వయంగా కృష్ణవంశీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.

 


కృష్ణవంశీకి సొంతంగా కథలు, స్క్రీన్ ప్లే రాసుకునే సత్తా ఉంది. మహాత్మా చిత్రానికి పరుచూరి సోదరుల చేతే మాటలు రాయించాడు. జాతీయవాదం ఉన్న సినిమా కాబట్టి వారి దగ్గర రెడీమేడ్ స్టఫ్ ఉంటుందని పరుచూరి సోదరులను సెలక్ట్ చేసుకున్నానని అప్పట్లో చెప్పాడు. రంగమార్తాండకు మాత్రం పరుచూరి వారి సాయం లేదని కృష్ణవంశీ అఫీషియల్ గా తేల్చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: