నిత్యా మీనన్ తెలుగు సిని లవర్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన టాలెంట్ చూపించింది. హీరోయిన్ గా ఉన్న కొన్నాళ్లు అందిన అవకాశం చేజిక్కించుకుని.. చేయాల్సిన పాత్రలన్ని చేయాలన్న కోరిక ఉంటుంది. కాని నిత్యా మీనన్ మాత్రం కొన్ని పాత్రలకే పరిమితం అయ్యింది.


ఆమె డిక్షనరీలో గ్లామర్, స్కిన్ షో అన్నవి ఉండవు. దర్శకులు తనని నమ్మి వస్తే తప్ప సినిమా చేయనని చెప్పేది. అందుకే ఆమెకు అవకాశాలు కూడా చాలా తక్కువ. చేసిన కొద్ది సినిమాలైనా సరే నటిగా గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. ఇదిలాఉంటే ఈమధ్య తెలుగు సినిమాల్లో కనిపించని నిత్యా మీనన్ ఇప్పుడు సన్నబడి కొత్తగా కనిపిస్తుంది.


గీతా గోవిందం సినిమాలో కెమియో రోల్ చేసిన నిత్యా మీనన్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సావిత్రిగా కనిపించింది. అయితే బొద్దుగా మారడం.. సన్నబడటం చాలా కామన్ అని.. అయితే తను కావాలని ఎవరి కోసమో తన ఇష్టాలని మార్చుకోనని చెప్పింది నిత్యా. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రేమలో ఓడిపోయానన్న విషయాన్ని వెళ్లడించారు నిత్యా మీనన్. 


అంతేకాదు ఓ తెలుగు హీరో ఇంట్లో తన వల్ల గొడవలు జరిగాయని.. అయితే తమ మధ్య అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పటికి పెళ్లి చేసుకునే వారం కదా అని అంటుంది నిత్యా మీనన్. మొత్తానికి తెలుగులో సినిమాలు తగ్గించడానికి ఇదే కారణం అనిపిస్తుంది. ఏది ఏమైనా మళ్లీ మునుపటిలా నిత్యా వరుస సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న కథలన్ని బాగుంటున్నాయని అందుకే ఒకదాని తర్వాత ఒకటి చేస్తా అని చెబుతుంది నిత్యా. 



మరింత సమాచారం తెలుసుకోండి: