సల్మాన్ దబాంగ్ 3
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ మూవీ డిసెంబర్ 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో
సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ వంటి సూపర్ హిట్ మూవీ తీశాడు. దబాంగ్ సీరీస్ లో వస్తున్న మూడో
సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సోనాక్షి సిన్హా ఇందులో హీరోయిన్. గత రెండు సిరీస్ లలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది.
సల్మాన్ ఖాన్ ఫస్ట్ సీరీస్ కు
అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, రెండో భాగానికి నిర్మాత అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. కాగా, మూడో భాగానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ
సినిమా తరువాత ప్రభుదేవాతో
సల్మాన్ ఖాన్ రాధే
సినిమా తీస్తున్నాడు.
సోహైల్ ఖాన్,
సల్మాన్ ఖాన్ లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ కు
సినిమా రిలీజ్ కాబోతున్నది. ఇక దబాంగ్ 3 విషయానికి వస్తే.. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో
మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్
సల్మాన్ కు లవర్ గా కనిపిస్తోంది.
ఇకపోతే, దబాంగ్ 3
సినిమా ట్రైలర్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. అంతేకాదు, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని థియేటర్స్ లో ఈ ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ ట్రైలర్ లో
సల్మాన్ ఖాన్ ను చాలా కొత్తగా కనిపించారు. తెలుగులోనూ ఈ ట్రైలర్ దుమ్మురేపింది. సినిమాపై నమ్మకం పెంచింది. ఇక ఇదిలా ఉంటె, గత సినిమాల్లో
సల్మాన్ తండ్రిగా చేసిన
వినోద్ ఖన్నా మరణించడంతో ఈ సినిమాలో ప్రమోద్ ఖన్నా
సల్మాన్ తండ్రిగా కనిపిస్తున్నారు. అంతేకాదు, మొదటి రెండు సీరీస్ లలో లాగానే ఇందులో
సల్మాన్ సోదరుడిగా అర్భాజ్ ఖాన్ కనిపిస్తున్నారు.
గత రెండు చిత్రాల్లో మాదిరిగానే ఇందులో
సోనాక్షి సిన్హా తండ్రిగా
మహేష్ మంజ్రేకర్ కనిపించడం విశేషం. ఇకపోతే, కన్నడ స్టార్ నటుడు ఈగ విలన్ కిచ్చ
సుదీప్ మొదటిసారిగా
బాలీవుడ్ లో విలన్ గా కనిపిస్తున్నాడు. విలన్ గా ఆయన ఆ సినిమాలో పవర్ఫుల్ గా కనిపిస్తుండటం విశేషం. రెండు సీరీస్ లలో బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉండదు. కానీ, దబాంగ్ 3 లో మాత్రం బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ సినిమాలాగానే ఈ మూవీ కూడా పూర్తిగా ఎంటర్టైనర్ గా ఉండబోతున్నది. ఈ సినిమాలో
అలీ కూడా నటిస్తుండటం విశేషం.